ఒక్కోసారి మనం తెలిసి తెలియక చేసిన చిన్న చిన్న పొరపాట్ల వల్ల జీవితంలో ఎంతో పెద్ద అగాధాన్ని సృష్టించుకుంటాం.ప్రతి వ్యక్తి జీవితంలోను ఇవి సాధారణంగా ఉండే ఉంటాయి.
అయితే మనం చేసే ఆ చిన్న మిస్టేక్ వల్ల మనం మాత్రమే కాదు పక్క వాళ్ళు కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు.అలాంటి ఒక ఉదాహరణ సీనియర్ నటి తులసి( Senior actress Tulsi ) విషయంలోనూ జరిగింది.
చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టిన తులసి ప్రస్తుతం తల్లి పాత్రల్లో కనిపిస్తుంది.వయసులో చాల పెద్ద నటీమణి అయినప్పటికీ ఆమె ఎనర్జీ లెవల్స్ చూస్తే పాతికేళ్ల కుర్ర హీరోయిన్ లాగ అనిపిస్తారు.
ఆమె మాట్లాడే తీరు కానీ, అవతల వాళ్ళతో చనువుగా ఉండటం కానీ చాల మాడ్రన్ గా ఉంటాయి.
కానీ తులసి కి ఉన్న ఈ కలుపుగోలు తనం ఆమెకు ఒక్కోసారి చిక్కులను తెచ్చి పెడుతుంది.అసలు విషయంలోకి వెళ్తే.తులసి ఒకసారి అలీతో సరదాగా ప్రోగ్రాం నటుడు ప్రభాస్ శ్రీను తో కలిసి వెళ్ళింది.
అక్కడ ఇద్దరు కలిసి వస్తే వారు స్నేహితులు కానక్కర్లేదు.కానీ ఆ షో తర్వాత ప్రభాస్ శ్రీను ( Prabhas Srinu )మరియు తులసి మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు.
డార్లింగ్ సినిమాలో కూడా ప్రభాస్ కి తల్లి పాత్రలో తులసి నటిస్తే మరొక పాత్రలో ప్రభాస్ శ్రీను నటించాడు.అయితే శ్రీను తో ఉన్న చనువు కొద్దీ అందరి ముందు ఒకసారి డార్లింగ్ అని పిలిచిందట.
అంతే సంగతులు అప్పటి నుంచి ప్రభాస్ శ్రీను కి మరియు తులసి కి మధ్య ఎదో జరిగిపోతుంది అంటూ వార్తలు రాయడం మొదలు పెట్టారు.తల్లి లాంటి తులసి తో తనకు ఇలాంటి ఒక రిలేషన్ అంటగట్టి వార్తలు వస్తుంటే ప్రభాస్ శ్రీను చాల ఫీల్ అయ్యారట.తులసి సైతం మొదట్లో ఈ వార్తలను లైట్ తీసుకున్న ఆ తర్వాత కందించారు.ఇక ప్రభాస్ శ్రీను వైఫ్ ఒక డాక్టర్ కాబట్టి ఆమె కూడా అర్ధం చేసుకుంటాడట.
దాంతో వ్యవహారం అయితే సర్దుమణిగింది కానీ ఒక చిన్న మాట వల్ల రెండు కుటుంబాల్లో అలజడి వచ్చింది.అందుకే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు లేదా నలుగురిలో ఉన్నప్పుడు కాస్త జాగ్రత్తగా ఉంటె అందరికి మంచి జరుగుతుంది.