"రాజుగారి కోడిపులావ్" చిత్రం నుండి సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న "సునో సునామీ" మొదటి సాంగ్..

ఏఎమ్ఎఫ్, కోన సినిమా బ్యానర్లపై అనిల్ మోదుగ, శివ కోన సంయుక్తంగా నిర్మిస్తున్న తాజా చిత్రం “రాజు గారి కోడిపులావ్” కుటుంబ కథా ‘వి’చిత్రం అనేది శీర్షిక.ఈ సినిమాకు శివ కోన దర్శకత్వం వహిస్తున్నారు.

 Suno Sunami Is The First Song From The Movie Rajugari Kodipulao Is Trend On Soci-TeluguStop.com

తాజాగా ఈ చిత్రం నుంచి విడుదలైన “సునో సునామి” ఫస్ట్ సింగిల్ ప్రోమో ఆకట్టుకోగా… ఈరోజు ఫుల్ సాంగ్ విడుదలైంది.క్యాచీ పదాలతో శ్రోతల్ని విపరీతంగా ఆకట్టుకుంటుంది.లవ్ రొమాంటిక్ సాంగ్ గా తెరకెక్కుతున్న ఈ పాటకు ‘మల్లిక్ వల్లభ’ చరణాలు అందించగా.‘ప్రవీణ్ మని’ సంగీత సారథ్యంలో ప్రముఖ గాయకులు ‘ఎన్సీ కారుణ్య, వైశాలి శ్రీ ప్రతాప్’ ఆలపించారు.“ఔరౌర కన్నె కోడి.ఓ వయ్యారి వన్నెలాడి.

ఇష్టపడినా లేడీ” అంటూ సాగే ఈ పాట సోషల్ మీడియా లో విజయవంతంగా దూసుకుపోతుంది.రాజుగారి కోడిపులావ్ చిత్రం నుంచి గతంలో విడుదల చేసిన వీడియో మూవీ లవర్స్ అందరి దృష్టిని ఆకర్షించింది.

నిర్మాతగా, డైరెక్షన్ బాధ్యతలు వహిస్తూనే శివ కోన ఈ చిత్రంలో డ్యాని పాత్రలో నటించారు.అలాగే అందరికి సుపరిచితుడు అయిన బుల్లితెర మెగాస్టార్ గా పేరున్న ఈటీవీ ప్రభాకర్ ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారు.

వీరితోపాటు నేహా దేశ్ పాండే, కునాల్ కౌశల్, ప్రాచీ కెథర్, రమ్య దేష్, అభిలాష్ బండారి తదితరులు నటిస్తున్నారు.

Telugu Suno Sunami-Movie

రీ యూనియన్ బ్యాచ్ గా కలిసిన కొంతమంది స్నేహితులు సరదాగా గడపడానికి ఒక అడవి ప్రాంతానికి వెళ్లి అక్కడ ఎదురైన విపత్కర పరిస్థితుల నుంచి తమ ప్రాణాలను కాపాడుకోవడానికి చేసిన సాహసమే రాజుగారి పులావ్ సినిమా.ఆద్యంతం సస్పెన్స్ క్రిమ్ థ్రిల్లర్ తో పాటు అందమైన ప్రేమకథతో తెరకెక్కుటున్నట్లు తెలుస్తుంది.ఇక ప్రేక్షకులకు ఉక్కిరిబిక్కిరి చేసి గొప్ప థ్రిల్లింగ్ అనుభూతిని రాజుగారి పులావ్ సినిమా కలిగిస్తుందని మేకర్స్ నమ్మకంతో ఉన్నారు.

అలాగే సినిమాపై ప్రేక్షకులకు కూడా మంచి అంచనాలు ఏర్పడుతున్నాయి.

నటీనటులు : శివ కోన, ప్రభాకర్, కునల్ కౌశల్, నేహా దేష్ పాండే, ప్రాచి కెథర్, అభిలాష్ బండారి, రమ్య దినేష్ తదితరులు

బ్యానర్ : ఏఎమ్ఎఫ్, కోన సినిమా నిర్మాతలు : అనిల్ మోదుగ, శివ కోన డైరెక్టర్ : శివ కోన సంగీతం : ప్రవీణ్ మని సినిమాటోగ్రఫి : పవన్ గుంటుకు ఎడిటర్ : బసవా సౌండ్ డిజైన్ : జీ.పురుషోత్తమ్ రాజు వీఎఫ్ ఎక్స్ : అండీ చంగ్ సౌండ్ మిక్సింగ్ : ఏ రాజ్ కుమార్ రచన సహకారం,ప్రొడక్షన్ కంట్రోలర్ : రవి సంద్రన పీఆర్ఓ : హరీష్, దినేష్

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube