ఎన్నికలకు దగ్గరలో ఉన్నందున రాజకీయ పార్టీలన్నీ ప్రజలకు దగ్గరలో ఉండే ఏర్పాట్లు చేసుకుంటున్నాయి.ఇప్పటి వరకు సినిమా లపై దృష్టి పెట్టిన జనశెన అదినేత ఇక పై ప్రజల్లో ఉండేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
ఈనెల 14వ తారీకు నుంచి ఉపయోగ గోదావరి జిల్లాలే కేంద్రంగా సుదీర్ఘ యాత్రకు ప్లాన్ చేసింది.అన్నవరం దేవస్థానం నుంచి మొదలై భీమవరంలో( Bhimavaram ) పూర్తయ్యేలాగా తొలి విడత వారాహి యాత్రకు( Varahi Yatra ) ప్లాన్ చేసుకున్న జనసేన పార్టీకి( Janasena party ) షాక్ ఇచ్చే లా వ్యవహరించారు పోలీసులు .ఆంక్షలు కొరడాను బయటకు తీశారు ఈ 12వ తారీకు నుంచి నెలాఖరు వరకు సెక్షన్ 30 అమలు లో ఉంటుంది కావున ముందస్తు అనుమతి లేకుండా ఎటువంటి సమావేశాలు ఊరేగింపులు , బహిరంగ సభలు ఏర్పాటు చేయకూడదంటూ పోలీసులు ఆదేశించారు.అమలాపురం కొత్తపేట డివిజన్ అంటే పూర్తిగా జనసేన నేతలు ఏర్పాటు చేసుకున్న వారాహి రూట్ మ్యాప్ లో ఉన్న అన్ని ప్రాంతాలు ఈ డివిజన్లోకి రావడంతో ఇది కచ్చితంగా జనసేన ను టార్గెట్ చేసే చర్య అని దీనిపై జనసేన నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు .
తమ అదినేత చరిష్మాన్ని చూసి ప్రభుత్వం భయపడుతుందని, అందుకే వారాహి యాత్రని అడ్డుకునేలా ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారు అంటూ విమర్శలు చేశారు.ప్రజాస్వామ్య దేశంలో ప్రజలను కలుసుకునే హక్కు ప్రతిపక్షాలకు ఉంటుందని ప్రభుత్వ చర్యలు నియంతృత్వాన్ని గుర్తు చేస్తున్నాయి అంటూ విమర్శలు వచ్చాయి.
అయితే ఇప్పుడు దీనిపై పోలీసు యంత్రాంగం ఒక స్పష్టతనిచ్చింది సాధారణ పరిపాలన విధుల్లో భాగంగానే ఈ అంశాలను తీసుకొచ్చాము తప్ప ఏదో ఒక పార్టీని ప్రత్యేకంగా అడ్డుకునేందుకు కాదని క్లారిటీ ఇచ్చారు అమలాపురం ఎస్పి .పవన్ కళ్యాణ్ సభ( Pawan kalyan ) జరిగే ప్రాంతాన్ని జనసేన నేతలతో కలిపి ఆయన పరిశీలించారు ముందస్తు అనుమతులు తీసుకొని ఎవరైనా యాత్రలు చేసుకోవచ్చని ఆయన క్లారిటీ ఇవ్వడంతో సస్పెన్షన్ ముగింపు పలికినట్లు అయింది ఇక తమ వారాహికి ఎదురులేదని జనసేన నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు
.