రాజన్న సిరిసిల్ల జిల్లా:రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా 17 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించిన గ్రూప్ – 1 ప్రిలిమ్స్ పరీక్ష ప్రశాంతంగా పూర్తయింది.ఆదివారం సిరిసిల్ల పట్టణంలోని విజ్ఞానవర్ధిని పాఠశాల, సాయిశ్రీ జూనియర్ కళాశాల, అయ్యప్ప డిగ్రీ కళాశాలను జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ అఖిల్ మహాజన్ క్షేత్ర స్థాయిలో తనిఖీ చేసి, గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్ష జరుగుతున్న తీరును పరిశీలించారు.
సీసీ కెమెరాల పర్యవేక్షణ, పరీక్షా కేంద్రాల వద్ద కల్పించిన భద్రత, హెల్త్ క్యాంప్ ను పరిశీలించి, హాజరు వివరాలను అడిగి తెలుసుకున్నారు.కాగా జిల్లాలో మొత్తం 4 వేల 261 మందికి గాను 2 వేల 915 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు.1 వేయి 346 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు.ఈ తనిఖీలో సిరిసిల్ల తహశీల్దార్ విజయ్ కుమార్, తదితరులు ఉన్నారు.