Sridevi Radhika: శ్రీదేవి కన్నా నాకేం తక్కువ అంటూ పెద్ద గొడవ చేసిన రాధిక

ఒక తరం వెనక్కి వెళితే సినిమా ఇండస్ట్రీ లో శ్రీదేవి ( Sridevi ) భారతదేశంలోనే

నంబర్ వన్ హీరోయిన్ గా

కొన్నేళ్ల పాటు ఏకచక్రాధిపత్యం చేసింది.చైల్డ్ ఆర్టిస్ట్ గా మొదలు పెట్టి ఆమె మూడు దశాబ్దాలకు పైగా నటించి వందల సినిమాల్లో కనిపించింది.

 Sridevi Fight With Radhika-TeluguStop.com

ముఖ్యంగా బాలీవుడ్ చిత్రాల్లో ఆమె తనదైన ముద్ర వేసింది.ఆమె బాలీవుడ్ స్టార్ ఐకాన్ గా ఎదిగినప్పటికీ ఆమెను ఆ స్థాయిలో నిలబెట్టింది మాత్రం తెలుగు సినిమా ఇండస్ట్రీ అని చెప్పక తప్పదు.

తెలుగు సినిమా ఇండస్ట్రీలో అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఆమెకు కొన్ని లక్షల మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది.ఎంత పెద్ద సినిమాలో నటిస్తున్న అలాగే నేషనల్ హీరోయిన్ గా ఎదిగినప్పటికీ కూడా ఆమె తెలుగు సినిమాలపై ఎంతో అభిమానంతో ఉండేవారు.

తెలుగు ఇండస్ట్రీలో ఆమెతో పాటు ఎంతో మంది హీరోయిన్స్ వచ్చినప్పటికీ ఆమెకు వచ్చినంత గుర్తింపు మరెవరికి రాలేదు.జయప్రద, రాధా, భానుప్రియ, రాధిక వంటి హీరోయిన్స్ కూడా బాలీవుడ్లో నటించినప్పటికీ అందరూ ఆమె సమకాలీకులుగా ఎదగలేకపోయారు.

ఇక శ్రీదేవి సోలో హీరోయిన్ గానే కాకుండా మిగతా సమకాలికుల్లో కొంతమంది హీరోయిన్స్ తో కూడా కలిసి నటించారు, చిరంజీవితో శ్రీదేవి ఎక్కువ సినిమాల్లో నటించడం విశేషం, ఆమె కృష్ణ, శోభన్ బాబుతో కూడా ఎక్కువగా కలిసి నటించేవారు.

Telugu Radhika, Sridevi, Radhika Sridevi, Tollywood-Movie

అయితే హీరోయిన్ రాధికతో( Radhika ) శ్రీదేవి కలిసి నటించిన చిత్రాలు కూడా ఉన్నాయి.జయప్రద మినహా శ్రీదేవికి ఇండస్ట్రీలో పెద్దగా వివాదాలు ఉండేవి కాదు.కానీ రాధిక లాంటి ఒక ఫైర్ బ్రాండ్ హీరోయిన్ తో కలిసి నటించినప్పుడు గొడవలు జరిగాయని అప్పటి తరం వారు చెబుతూ ఉంటారు.

వారు ఎదురెదురుగా ఎప్పుడూ ఒక మాట కూడా అనుకునేవారు కాదు.ఇద్దరు కలిసి చాలా బాగా కలిసి ఉండడం, అలాగే కలిసి మెలిసి షాపింగ్ చేయడం కూడా చేసేవారట.

Telugu Radhika, Sridevi, Radhika Sridevi, Tollywood-Movie

అసలు విషయం ఏంటంటే ఒక తమిళ సినిమాలో రాధిక, శ్రీదేవి కలిసి నటించగా, శ్రీదేవి తో సమానంగా రాధిక పారితోషకం( Radhika Remuneration ) కావాలంటూ డిమాండ్ చేయడమే వివాదానికి కారణమయ్యింది.దాంతో గొడవ పెద్దదవుతుందని భావించిన నిర్మాత శ్రీదేవిని తన పారితోషకాన్ని కాస్త తగ్గించుకోమని కోరారట.దానికి శ్రీదేవి ఒప్పుకోకపోగా ఆమె అప్పటికే తెలుగు, తమిళ, సౌత్ ఇండియాలోనే కాకుండా బాలీవుడ్ లో కూడా నెంబర్ వన్ స్థానంలో ఉన్నారు.దాంతో రాధిక చెప్పినట్టుగా శ్రీదేవి తక్కువ రెమ్యునరేషన్ తీసుకోలేదు.

ఇక ఈ గొడవ పెద్దదవుతుంది అని భావించిన నిర్మాత రాధికను తీసేసి సరిత సినిమాను ముగించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube