బీజేపీ ఓటమినే చంద్రబాబు కోరుకున్నారా ?

ఇటీవల దేశ వ్యాప్తంగా ఆసక్తిరేకెత్తించిన కర్నాటక ఎన్నికల్లో బీజేపీ ఘోర ఓటమి చవి చూసిన సంగతి తెలిసిందే.మోడి మేనియా, డబుల్ ఇంజన్ సర్కార్ ఇలా ఏవి కూడా బీజేపీ ఓటమిని నిలువరించలేకపోయాయి.

 Did Chandrababu Naidu Want Bjp's Defeat Karnataka , Chandrababu Naidu, Bjp, Ycp,-TeluguStop.com

సౌత్ రాష్ట్రాలలో అధికారంలో ఉన్న కర్నాటకను కూడా కోల్పోవడంతో బీజేపీకి ఏం చేయాలో అర్థం కానీ పరిస్థితి.ఇక రాబోయే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూడా బీజేపీకి షాక్ తగిలితే.

టోటల్ గా సౌత్ లోనే కాషాయ పార్టీ ఉనికి ప్రశ్నార్థకం అవుతుంది.ఇదిలా ఉంచితే కర్నాటక ఎన్నికల్లో బీజేపీ గెలవాలని ఆ పార్టీ నేతలు ఏ స్థాయిలో ఆశపడ్డారో అంతే స్థాయిలో ఆ పార్టీ ఓడిపోవాలని కాంగ్రెస్ నేతలు కోరుకున్నారు.

అయితే అక్కడ బీజేపీకి కాంగ్రెస్ ప్రత్యర్థి కాబట్టి అలా కోరుకోవడం సహజం.

Telugu Ap, Chandrababu, Janasena, Pawan Kalyan, Ys Jagan-Politics

అయితే ఆ ఎన్నికలతో ఏ మాత్రం సంబంధం లేని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా బీజేపీ ఓటమిని గట్టిగానే కోరుకున్నారట.ఇది ఎవరో అన్నమాట కాదండోయ్ ఏపీ సి‌ఎం జగన్మోహన్ రెడ్డి అన్న మాట.కర్నాటకలో కాంగ్రెస్ విజయాన్ని చంద్రబాబు( Chandrababu Naidu ) సెలబ్రేట్ చేసుకున్నారని, బీజేపీ ఓటమిని ఆయన బలంగా కోరుకున్నారని జగన్ తాజాగా వ్యాఖ్యానించారు.అయితే చంరబాబు బీజేపీ ఓటమిని కోరుకోవడానికి కారణం లేకపోలేదు.బీజేపీ కర్నాటక( Karnataka )లో ఓడిపోవడం వల్ల ఆ ప్రభావం ఏపీలో బీజేపీపై పడుతుందని, అందువల్ల ఏ పరిణామాల నుంచి బయటపడేందుకు తప్పనిసరిగా టీడీపీతో చేతులు కలపక తప్పదనిది చంద్రబాబు ఉద్దేశంగా జగన్ చెప్పుకొచ్చారు.

Telugu Ap, Chandrababu, Janasena, Pawan Kalyan, Ys Jagan-Politics

వచ్చే ఎన్నికల్లో వైసీపీని గద్దె దించేందుకు టీడీపీ అందివచ్చిన ప్రతి వ్యూహాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.వైసీపీని గద్దె దించాలంటే పొత్తులే ఉత్తమం అని భావించిన చంద్రబాబు.పవన్( Pawan kalyan ) తో చేతులు కలిపారు.అయితే వచ్చే ఎన్నికల్లో కూడా కేంద్రంలో బీజేపీనే అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నందున ఆ పార్టీని కూడా కలుపుకొని 2014 కూటమిని రిపీట్ చేయాలనేది బాబు వ్యూహం.

అయితే టీడీపీతో కలిసేందుకు మొన్నటి వరకు ససేమిరా అని బీజేపీ.కర్నాటకలో ఓటమి తరువాత టీడీపీ దోస్తీ విషయంలో పునఃఆలోచిస్తోంది.దీంతో త్వరలోనే బీజేపీ కూడా టీడీపీతో కలిసి జనసేన బీజేపీ టీడీపీ కూటమిగా ఏర్పడేందుకు సిద్దమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.అందుకే బీజేపీ ఓటమిని కాంగ్రెస్ కంటే చంద్రబాబే ఎక్కువ కోరుకున్నారని వైసీపీ ఆరోపిస్తోంది.

మరి ఈ త్రిముఖ కూటమి ఎప్పుడు అధికారికంగా ఏర్పడుతుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube