ఎన్టీఆర్ మూవీ వల్ల అన్ని రూ.కోట్ల నష్టం.. ఇండస్ట్రీ వదిలేయాలని అనుకున్నానంటూ?

జూనియర్ ఎన్టీఆర్ మెహర్ రమేష్( NTR, Meher Ramesh ) కాంబినేషన్ లో అశ్వినీదత్ నిర్మాతగా తెరకెక్కిన శక్తి సినిమా( Shakti Movie ) 2011 సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీన థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను ఫూల్స్ చేసింది.మగధీరను మించిన సినిమా చేయాలని అశ్వినీదత్( Ashwini Dutt ) ఈ సినిమా కోసం ప్లాన్ చేయగా ఈ సినిమా మాత్రం భిన్నమైన ఫలితాన్ని సొంతం చేసుకోవడం గమనార్హం.

 Producer Ashwini Dutt About Junior Ntr Shakti Movie Losses Details, Junior Ntr,-TeluguStop.com

ఈ సినిమా ఫలితం గురించి తాజాగా మరోమారు స్పందించిన అశ్వినీదత్ షాకింగ్ కామెంట్లు చేశారు.

నేను ఏదైనా మూవీ వల్ల దెబ్బ తింటే చిరంజీవి గారు కథ సిద్ధం చేసుకుంటే మరో మూవీ చేద్దామని చెప్పేవారని నాగార్జున కూడా సేమ్ అని అశ్వినీదత్ తెలిపారు.

శక్తి మూవీ నా సినీ కెరీర్ లో ఎంతో నిరాశకు గురి చేసిందని ఆయన కామెంట్లు చేశారు.ఆ సినిమా ఫలితం వల్ల ఇండస్ట్రీ వదిలి వెళ్లిపోవాలని అనిపించిందని అశ్వినీదత్ చెప్పుకొచ్చారు.

సినిమా నిర్మాణ వ్యయం గతంతో పోల్చి చూస్తే పెరిగిందని ఆయన అన్నారు.

Telugu Ashwini Dutt, Ashwinidutt, Meher Ramesh, Ntr, Ntr Shakti, Shakti-Movie

శక్తి సినిమా వల్ల ఏకంగా 32 కోట్ల రూపాయల నష్టం వచ్చిందని ఈ నష్టం మామూలు నష్టం కాదని అశ్వినీదత్ కామెంట్లు చేశారు.శక్తి ఫలితం నాకు షాక్ ఇవ్వడంతో ఐదు సంవత్సరాల పాటు సినిమాల నిర్మాణానికి పూర్తిస్థాయిలో దూరమయ్యానని ఆయన తెలిపారు.నా పిల్లలు మంచి సినిమాలను నిర్మిస్తుండటంతో వాళ్లను ప్రోత్సహిస్తున్నానని అశ్వినీదత్ కామెంట్లు చేశారు.

Telugu Ashwini Dutt, Ashwinidutt, Meher Ramesh, Ntr, Ntr Shakti, Shakti-Movie

టీడీపీ కోసం నేను ఎప్పటికీ పని చేస్తూనే ఉంటానని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.2024 ఎన్నికల్లో సైతం టీడీపీకి నా వంతు సహకారం అందిస్తానని ఆయన చెప్పుకొచ్చారు.ప్రస్తుత ఏపీ ప్రభుత్వానికి సినిమా ఇండస్ట్రీని కలుపుకుని వెళ్లాలని లేదని అశ్వినీదత్ అభిప్రాయపడ్డారు.అశ్వినీదత్ ఏపీ ప్రభుత్వంపై చేసిన కామెంట్ల గురించి వైసీపీ ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube