కష్టజీవుల విముక్తికి ఏకైక మార్గం ఎర్రజెండా

కష్టజీవుల విముక్తికి ఏకైక మార్గం ఎర్రజెండా మేడే స్ఫూర్తితో మోడీ ని గద్దె దించాలి సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు టి.స్కైలాబ్ బాబు కోట్లాదిమంది కష్టజీవుల విముక్తికి ఏకైక మార్గం ఎర్ర జెండానే.

 Red Flag Is The Only Way For The Liberation Of The Poor , Suresh Naik, Arun Kuma-TeluguStop.com

ప్రపంచ కార్మిక దినోత్సవం మే డే స్ఫూర్తితో కార్మికులు సంఘటిత ఉద్యమాలకు సిద్ధం కావాలి.మేడే స్పూర్తితో మోడీని గద్దె దించాలి.

సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు టి స్కైలాబ్ బాబు.రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో అమరవీరుల స్తూపం వద్ద సిపిఎం జెండాను సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు స్కైలాబ్ బాబు ( Skylab Babu )అలాగే సీఐటీయూ జెండాను సిఐటియు మండల అధ్యక్షులు మేకల దేవయ్య ఎగురవేశారు.

అనంతరం వీర్నపల్లి మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు మల్లారపు అరుణ్ కుమార్( Arun Kumar ) అధ్యక్షతన మేడే బహిరంగ సభను నిర్వహించారు.ఈ సభకు ముఖ్యఅతిథిగా హాజరైన సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు టి స్కైలాబ్ బాబు మాట్లాడుతూ పీడిత ప్రజల విముక్తికి ఏకైక మార్గము ఎర్రజెండానేనని, నాడు పని గంటలు తగ్గింపు కోసం అమెరికా దేశం చికాగో నగరంలో కార్మికులు చిందిoచిన రక్తంతో తడిసిన జెండా ప్రపంచ మానవాలివిముక్తి మార్గాన్ని చూపిందన్నారు.

పాలకవర్గాలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం కార్మికులకు కొన్ని వాగ్దానాలు కల్పించి తాత్కాలికంగా మభ్యపెట్టినప్పటికి ప్రజాఉద్యమాల ఫలితంగా ప్రజలు చాలా హక్కులు సాధించుకున్నారని చెప్పారు.అలాగే కేంద్ర బిజెపి ప్రభుత్వం నాడు కార్మికుల పోరాడి తెచ్చుకున్న చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోట్లు తెచ్చి కార్మికులను శ్రమను దోచి కార్పొరేట్ శక్తులకు దోచిపెడుతుందని విమర్శించారు.12 గంటల పని విధానాన్ని తీసుకొచ్చి కార్మికులను కట్టుబానిసలుగా మారుస్తుందన్నారు.బీజేపీ సర్కార్ అనుసరిస్తున్న విధానాలపై సంఘటిత పోరాటం చేయకపోతే దేశం ప్రమాదంలో చిక్కుకుంటుందన్నారు.

కార్మికుల కనీస వేతనం, ఉద్యోగ భద్రత వంటి అనేక సమస్యలపై ఉద్యమాలు చేయాలని చెప్పారు .పోడు భూముల సమస్యలు,పేదల ఇండ్లస్థలాలు, డబల్ బెడ్ రూమ్ ఇండ్ల సమస్యలపై రాజీలేని పోరాటాలకు ఎర్రజెండా సిద్ధమవుతుందన్నారు.కమ్యూనిస్టులను ఆదరించడం ద్వారా ఆ ఉద్యమాల్లో భాగస్వాములు కావడం ద్వారా పేదలు ఆత్మగౌరవంతో హక్కుల సాధనలో ముందు వరుసలో నిలబడాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామసభ సర్పంచ్ పాటి దినకర్, సెస్ డైరెక్టర్ మాడుగుల మల్లేశం యాదవ్,బంజారా సేవా సంఘం రాష్ట్ర నాయకుల సురేష్ నాయక్( Suresh Naik ),సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మల్లారపు ప్రశాంత్, సిఐటియు మండల నాయకులు కూస రాజం, లడ్డూరి నర్సయ్య, రాజు రాములు,ప్రశాంత్ ,జంగం అంజయ్య, లక్ష్మీనారాయణ, నరేందర్,ఎస్ ఎఫ్ ఐ నాయకులు మనోజ్,దినకర్, బీమ్ ఆర్మీ జిల్లా ప్రెసిడెంట్ దొబ్బల ప్రవీణ్, కెవిపిఎస్ నాయకులు వేణు సుధీర్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube