విక్రమ్( Vikram ) హీరోగా నటించిన నాన్న ( Naanna Movie ) అనే తమిళ సినిమా తెలుగు లో డబ్బింగ్ అయ్యి మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.తెలుగులో నాన్న కమర్షియల్ గా ఎంత సక్సెస్ అయింది అనే విషయాన్ని పక్కన పెడితే ఆ సినిమాలో విక్రమ్ నటన అద్భుతంగా ఉంటుంది.
అంతే కాకుండా సారా అర్జున్( Sara Arjun ) అనే చిన్న పాప చేసిన యాక్టింగ్ కి ప్రతి ఒక్కరు కన్నీళ్లు పెట్టుకుంటారు.ముఖ్యంగా కోర్టు సన్నివేశంలో సారా అర్జున్ చేసిన యాక్టింగ్ కి ప్రతి ఒక్కరు కూడా ఫిదా అవ్వాల్సిందే.
ఆ నటనకు గాను పాప కి ఎన్నో అవార్డులు రివార్డులు సొంతమయ్యాయి.సారా అర్జున్ అనగానే ఇప్పటికీ ఆ కోర్టు సన్నివేశాలే ప్రేక్షకులకు గుర్తుకు వస్తాయి.
నాన్న సినిమా పేరు చెప్పగానే ఎక్కువ శాతం మంది విక్రమ్ తో పాటు ఆ పాప పేరును తలుచుకుంటారు.
చిన్న పాపగా ముద్రపడిన సారా అర్జున్ ఇప్పుడు హీరోయిన్ గా ఎంటర్ ఇచ్చేందుకు సిద్ధమైంది.
చిన్నారి కాస్త పెద్ద పాప అయింది.త్వరలోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వాలని ఆశ పడుతుంది.
కానీ సారా అర్జున్ అనగానే అందరూ కూడా నాన్న సినిమా లో చిన్నారి పాపగానే భావిస్తూ ఉంటారు.అలాంటి పాపకి హీరోయిన్ గా అవకాశం వస్తుందా అంటే కష్టమే అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
హీరోయిన్ గా తమిళంలో ఈమెకు ఆఫర్స్ వస్తాయేమో కానీ తెలుగులో మాత్రం చిన్నారిగా ఆ సినిమాలో నటించి ఇప్పుడు హీరోయిన్ గా నటిస్తానంటే ఏ ఒక్కరూ ఒప్పుకోరు.
ఎందుకంటే తెలుగు ప్రేక్షకులు ఒక పాత్రకు బాగా ఫిదా అయితే మళ్లీ మళ్లీ ఆ పాత్ర తాలూకు జ్ఞాపకాల్లోనే ఉంటారు.వారిని వేరే పాత్రల్లో ఊహించుకునేందుకు చూసేందుకు కానీ ఆసక్తి చూపించరు.కనుక ఆ చిన్నారి ని హీరోయిన్ గా చూసేందుకు తెలుగు ప్రేక్షకులు ఆసక్తి చూపించే అవకాశాలు చాలా తక్కువ అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు లో ఈ ముద్దుగుమ్మ నటించినా.నటించకున్నా తమిళంలో మాత్రం వరుసగా సినిమాల్లో నటించే అవకాశాలు ఉన్నాయి.
తమిళంలో సూపర్ హీరోయిన్ గా పేరు తగ్గించుకున్న తర్వాత తెలుగులో హీరోయిన్ గా ప్రయత్నిస్తే బాగుంటుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.మొత్తానికి సారా అర్జున్ తాజాగా నటించిన మణిరత్నం సినిమా పొన్నియన్ సెల్వన్ తో వార్తల్లో నిలిచింది.త్వరలో హీరోయిన్ గా ఇంటర్వ్యూ ఇవ్వబోతున్నట్లుగా పేర్కొంది.ఐశ్వర్య రాయ్ చిన్నప్పటి పాత్రలో నటించిన సారా అర్జున్ సినిమా సక్సెస్ లో కీలక పాత్ర పోషించిందంటూ కొందరు అభిప్రాయం పని చేస్తున్నారు వ్యక్తం చేస్తున్నారు.