Agent Review: ఏజెంట్ రివ్యూ: అఖిల్ పని అయిపోయినట్లేనా?

డైరెక్టర్ సురేందర్ రెడ్డి( Director Surender Reddy ) దర్శకత్వంలో రూపొందిన సినిమా ఏజెంట్.( Agent ) ఇందులో అక్కినేని వారసుడు అఖిల్ ( Akkineni Akhil ) హీరోగా నటించాడు.

 Akhil Akkineni Sakshi Vaidya Agent Movie Review And Rating-TeluguStop.com

అంతేకాకుండా మమ్ముట్టి, సాక్షి వైద్యా, డినో మోరియా, మురళి శర్మ, పోసాని కృష్ణమురళి తదితరులు నటించారు.ఇక ఈ సినిమాను ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్ పై గ్రామ బ్రహ్మం సుంకర నిర్మించారు.

రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టాడు.హిప్ హాప్ తమిజా సంగీతాన్ని అందించారు.

ఇక గత కొన్ని రోజుల నుండి ఈ సినిమా నుండి వస్తున్న అప్డేట్లు ప్రేక్షకులను కొంతవరకు ఊరట తెప్పించాయి.అంతేకాకుండా డిఫరెంట్ లుక్కుతో కనిపించిన అఖిల్ లుక్ కూడా బాగానే ఆకట్టుకుంది.

అలా కొంతవరకు సినిమాపై అంచనాలు పెరగగా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఇప్పటివరకు సరైన సక్సెస్ లేని అఖిల్ కు ఈ సినిమా ఎటువంటి సక్సెస్ అందించిందో చూద్దాం.

Telugu Story, Review, Akhil, Dino Morea, Surender Reddy, Mammootty, Murali Sharm

కథ:

కథ విషయానికి వస్తే.ఈ సినిమా రా ఏజెన్సీ ప్రధానంగా సాగే నేపథ్యంలో రూపొందించారు.అంటే ఇది ఒక యాక్షన్ సినిమా.ఇక ఇందులో రా ఆఫీసర్ మమ్ముట్టి ( Mammootty ) ఒక మాఫిమా ముఠాని పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు.కానీ అతన్ని పట్టుకోవడంలో డిపార్ట్ మెంట్ విఫలం అవుతుంది.ఈ తరుణంలోనే అతని ముఠాను పట్టుకోవడానికి కొంటె ప్రవర్తన కలిగిన అఖిల్ అయితే బెటర్ అని భావిస్తారు.

అలాంటి వాడే ఇలాంటి క్రిమినల్స్ ను పట్టుకోగలడని హీరో అఖిల్ కు ఆపరేషన్ ఏజెంట్ బాధ్యతలను అప్పగిస్తారు.దీంతో అఖిల్ తన అల్లరితో వారిని ఎలా పట్టుకుంటాడనేది, అంతేకాకుండా హీరోయిన్ తో తనకు ఎలా పరిచయం ఏర్పడుతుంది అనేది, చివరికి ఏం జరుగుతుంది అనేది మిగిలిన కథలోనిది.

నటినటుల నటన:

నటీనటుల నటన విషయం చూస్తే.ఏ సినిమాలో కనిపించని విధంగా ఈ సినిమాలో కనిపించాడు అఖిల్.

పైగా చాలా కష్టపడినట్లు కూడా కనిపిస్తుంది.యాక్షన్స్ సన్నివేశాలలో బాగా అదరగొట్టాడు.

హీరోయిన్ సాక్షి కూడా పరవాలేదు అన్నట్లుగా అనిపించింది.మమ్ముట్టి బాగా ఫిదా చేశాడు.

మిగతా నటీనటులంతా పాత్రకు తగ్గట్టుగా పనిచేశారు.

Telugu Story, Review, Akhil, Dino Morea, Surender Reddy, Mammootty, Murali Sharm

టెక్నికల్:

టెక్నికల్ విషయానికి వస్తే.డైరెక్టర్ మంచి కథను అందించినప్పటికీ కూడా చూపించడంలో విఫలమయ్యాడని చెప్పాలి.హిప్ హాప్ తమిజా అందించిన సంగీతం ఆకట్టుకోలేకపోయింది.

సినిమాటోగ్రఫీ కూడా మామూలుగా ఉందని చెప్పాలి.మిగత నిర్మాణ విభాగాలు సినిమాకు తగ్గట్టు పనిచేశాయి.

విశ్లేషణ:

ఇక ఈ సినిమాకు ఒక రేంజ్ లో ఖర్చు చేసినప్పటికీ కూడా ఫలితం లేకుండా పోయింది.కథపరంగా దర్శకుడు కాస్త వెనుకబడినట్లు కనిపించాడు.

కొన్నిచోట్ల అఖిల్ యాక్షన్ సీన్స్ బాగా అనిపించగా నటన పరంగా మాత్రం వెనుకబడినట్లే అనిపించాడు.కొన్ని సీన్స్ అక్కడక్కడ ప్రేక్షకులకు మజా తెప్పించగా.

మరి కొన్ని సీన్స్ బోరింగ్ గా అనిపించాయి.

Telugu Story, Review, Akhil, Dino Morea, Surender Reddy, Mammootty, Murali Sharm

ప్లస్ పాయింట్స్:

ఇంటర్వెల్, యాక్షన్ సీన్స్.

మైనస్ పాయింట్స్:

కథ అంతగా ఆకట్టుకోలేకపోయింది.లవ్ స్టోరీ బోరింగ్ గా అనిపించింది.బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అంతగా ఆకట్టుకోలేకపోయింది.

బాటమ్ లైన్:

చివరగా చెప్పాల్సిందేంటంటే ఈ సినిమా అక్కినేని అభిమానులకు మాత్రమే నచ్చుతుందని చెప్పాలి.ఇక ఈసారి కూడా అఖిల్ పని అయిపోయినట్లే అనిపిస్తుంది.

రేటింగ్: 2.25/5

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube