ప్రియురాలిపై అనుమానంతో ప్రియుడు దారుణం.. కాస్త ఆలస్యంగా వెలుగులోకి..!

సమాజంలో అనుమానం అనేది వైరస్ కంటే అత్యంత ప్రమాదకరం.అనుమానం వస్తే కుటుంబాలకు కుటుంబాలే నాశనం అవుతాయి.

 Suspicious Of The Girlfriend, The Boyfriend Is Cruel It Came To Light A Little L-TeluguStop.com

ఇటీవలే కాలంలో జరుగుతున్న దారుణాలకు మూలం అనుమానమే.ఏదైనా మనం చూసే దృష్టిని బట్టే ఉంటుంది.

అనుమానం ముందు ఎటువంటి బంధమైన ఎక్కువ కాలం నిలవదు.అనుమానం అనేది నమ్మకాన్ని తొలగించి గొడవలకు కారణం అవుతుంది.

ఈ కోవకు చెందిన ఒక సంఘటన ఉత్తర ప్రదేశ్ ( Uttar Pradesh )లో చోటుచేసుకుంది.వివరాల్లోకెళితే.

ఉత్తర ప్రదేశ్ లో పెండేలా వర్మ- మారుతి రాథోడ్( Pendela Verma- Maruti Rathore ) ల పరిచయం కాస్త ప్రేమగా మారింది.ఇద్దరూ గత రెండు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు.

పెండేలా కు వీడియోలు చేయడం, ఆ వీడియోలను సోషల్ మీడియాలో పొందుపరచడం అంటే చాలా ఇష్టం.నిత్యం తన మగ స్నేహితులతో కలిసి వీడియోలు చేయడం, వాటిని సోషల్ మీడియా లో షేర్ చేయడం మారుతి రాథోడ్ కు ఇష్టం లేదు.

దీంతో ఎప్పుడు ప్రియురాలిపై గొడవ పడేవాడు.మగ స్నేహితులతో కలిసి వీడియోలు చేయడం ఆపేయాలని గట్టిగా చెప్పడంతో.పెండేలా అందుకు అంగీకరించలేదు.వాళ్లు నా స్నేహితులు వాళ్లతో వీడియోలు చేస్తే తప్పేముంది.ఈ విషయంలో నీ మాట వినేదే లేదని తెగేసి చెప్పేసింది.ఎంత చెప్పినా పెండేలాలో మార్పు రాదని గ్రహించిన మారుతి, ఆమెను చంపాలని మాస్టర్ ప్లాన్ వేశాడు.

ప్లాన్ లో భాగంగా పెండేలా ను తన సొంత ఊరికి తీసుకువచ్చి, ఎవరు లేని సమయంలో గొంతు నులిమి చంపేశాడు.మృతదేహాన్ని ఓ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి కాల్చేశాడు.

కాలిన శవాన్ని గుర్తించిన స్థానికులు, పోలీసులకు సమాచారం అందించారు.పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

మారుతి పై అనుమానంతో అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా అసలు విషయం బయటపడింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube