పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయక్ చిత్రంలో రానా కి జోడిగా చిన్న పాత్రలో కనిపించిన సంయుక్త మీనన్( Samyuktha Menon ) ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకు పోతోంది.భీమ్లా నాయక్ చిత్రంలో చిన్న పాత్రలోనే నటించిన కూడా ఆ సినిమాతో మంచి సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్న సంయుక్త ఆ తర్వాత బింబిసార మరియు సార్ చిత్రాలతో కమర్షియల్ సక్సెస్ లను సొంతం చేసుకుంది.
దాంతో మెగా హీరో విరూపాక్ష ( Virupaksha ) చిత్రంలో కూడా నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంది.ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన విరూపాక్ష చిత్రం భారీ కమర్షియల్ విజయాన్ని సొంతం చేసుకునే దిశగా పరుగులు తీస్తోంది.
ఈ నేపథ్యంలో సంయుక్త తన రెమ్యూనరేషన్ ని భారీగా పెంచే విషయమై ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది.ఇప్పటి వరకు కోటికి లోపు రెమ్యూనరేషన్ తీసుకున్న సంయుక్త ఏకంగా రెండు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ని డిమాండ్ చేస్తుంది అంటూ ఒక నిర్మాత ఆఫ్ ది రికార్డ్ మీడియా సన్నిహితుల వద్ద పేర్కొన్నట్లుగా తెలుస్తోంది.
తాను తీయబోతున్న ఒక మీడియం బడ్జెట్ సినిమా కోసం సంయుక్త ని హీరోయిన్ గా ఎంపిక చేయాలని ఆ నిర్మాత భావించాడట.
అందుకే ఆమెను విరూపాక్ష విడుదల అవ్వగానే సంప్రదించాడు.కానీ ఆమె చెప్పిన పారితోషకం విని షాక్ అయిన ఆ నిర్మాత.మీ రేంజ్ కు నేను సరిపోను లేండి అనుకుంటూ అక్కడ నుండి వెళ్లొచ్చాడట.
సాయి ధరమ్ తేజ్( Sai Dharam Tej ) హీరోగా రూపొంది ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన విరూపాక్ష చిత్రంలో సంయుక్త పాత్రకి మంచి ప్రాముఖ్యత లభించింది.అంతే కాకుండా ఆ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో సంయుక్త తన రెమ్యూనరేషన్ ని పెంచడం సమర్థనీయమే.
సక్సెస్ వచ్చినప్పుడు కాకుండా ఫెయిల్యూర్ వచ్చినప్పుడు పారితోషికాన్ని పెంచుతారా ఏంటి అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.
అయితే పెంపు విషయంలో ఒక హద్దు అనేది ఉండాల్సిన అవసరం ఉంది.విరూపాక్ష సినిమా సక్సెస్ తో ఏకంగా రెండు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడం అనేది కచ్చితంగా మంచి పద్ధతి కాదు అనేది కొందరు ఆమెను హెచ్చరిస్తున్నారు.ఇదే స్థాయిలో పారితోషికం డిమాండ్ చేస్తే కచ్చితంగా ముందు ముందు పెద్ద సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని.
అవకాశాలు రాకపోయే ఛాన్సులు కూడా ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.