ఈవీవీ వారసుడిగా ఆయన డైరెక్టర్ అయితే హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అల్లరి నరేష్( Allari Naresh ).రవిబాబు డైరెక్ట్ చేసిన అల్లరి సినిమాతో తొలి సినిమా టైటిల్ నే తన స్క్రీన్ నేం గా మార్చుకున్నాడు అల్లరోడు.
ఇక అప్పటి నుంచి తన మార్క్ కామెడీ సినిమాలు చేస్తూ వచ్చాడు.ఒకప్పుడు ఏడాదికి నాలుగు సినిమాలు రిలీ చేస్తూ మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు అల్లరి నరేష్.
అయితే కొన్నేళ్లుగా సరైన సక్సెస్ లు లేని అతను తన పంథా మార్చేశాడు.
విజయ్ కనకమేడల డైరెక్షన్ లో వచ్చిన నాంది ( Nandi )సినిమాతో అల్లరి నరేష్ ఫుల్ లెంగ్త్ సీరియస్ రోల్ చేశాడు.ఈ సినిమా సక్సెస్ అవడంతో ఇక మీదట అలాంటి సినిమాలే చేయాలని ఫిక్స్ అయ్యాడు.ఈ క్రమంలో నాంది డైరెక్టర్ తోనే మరోసారి ఉగ్రం( ugram ) అంటూ వస్తున్నాడు నరేష్.
ఈ సినిమా ట్రైలర్ లేటెస్ట్ గా రిలీజ్ కాగా అందులో నరేష్ ఉగ్ర రూపం చూపించాడు.ఓ విధంగా నరేష్ లోని అల్లరిని ఇక చూడలేమని అర్ధమవుతుంది.
అయితే అల్లరి నరేష్ మాత్రం కామెడీ సినిమాలు కూడా చేస్తా కానీ అందులో కథ బాగుండాలని అన్నారు.