తాము కొనుగోలు చేసిన భూమిని కాజేసేందుకు తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించడమే కాకుండా తమపై బొల్లి రాములు, తొట్టి కొమరయ్య ప్రోద్బలంతో వేల్పుల వెంకన్న మరో పదిమంది మాపై దాడిచేసి అత్యాయత్నం చేశారని బాధితులు బొల్లి కొమరయ్య, అల్లిక అంజయ్య, మంద లింగయ్య, బందు వెంకటేశ్వర్లు ఆరోపించారు.ఖమ్మం ప్రెస్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ… ఖమ్మం నగరంలోని యుపిహెచ్ కాలనీలో సర్వేనెంబర్ 318 లో గల 683 చదరపు గజాల స్థిరాస్తి భూమి మా పేరున ఉందని, దానిని కాజేసేందుకు గత కొంతకాలంగా అనేక ప్రయత్నాలు చేస్తూ దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతూ తీవ్రంగా గాయపరిచారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ భూమిపై తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించి వారి బినామీలకు విక్రయించినట్టు, రిజిస్ట్రేషన్ చేయించి సొమ్ము చేసుకునేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.ఇదే విషయమై గత నెలలో మాకు భూమిని విక్రయించిన వారి దృష్టికి తీసుకువెళ్లగా మీ దిక్కున చోట చెప్పుకో అని బెదిరింపులకు పాల్పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.ఈ అంశంపై చర్చించగా వాటికి సంబంధించిన భూమి విలువ ప్రకారం రూ.16,50000 లు బొల్లి రాములకి చెల్లించడం జరిగిందని,
మాకు ఇవ్వాల్సిన డాక్యుమెంట్లు ఇవ్వకపోగా అవి కాలిపోయాయని అబద్ధపు మాటలు చెబుతూ మా పైనే బెదిరింపులకు పాల్పడుతున్నారని విమర్శించారు.ఇప్పటికే పోలీస్ స్టేషన్లో వారిపై ఫిర్యాదు చేయడం జరిగిందని,డబ్బులు తీసుకుని భూమిని అప్పజెప్పకుండా బెదిరింపులు, దాడులకు పాల్పడుతున్న వారిపై జిల్లా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని వేడుకున్నారు.