రాజన్న సిరిసిల్ల జిల్లా: భారత రాజ్యాంగ నిర్మాత , ప్రపంచ మేధావి,బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి , రాజకీయవేత్తగా ,న్యాయవేత్తగఆర్థికవేత్తగా , సామాజికవేత్తగా భారతదేశానికి ఎనలేని సేవలు అందించినటువంటి మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 132 వ.జయంతి సందర్భంగా ఈరోజు సిఐటియు తంగళ్ళపల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలలు వేసి ఆయన జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ మాట్లాడుతూ జిల్లాలోని కార్మిక వర్గ ప్రజలందరికీ అంబేద్కర్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు.అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగానికి మూలస్తంబాలైనా,సమానత్వం సామాజికన్యాయం ప్రజాస్వామ్యం , లౌకికత్వాన్ని కేంద్ర బిజెపి ప్రభుత్వం ధ్వంసం చేసే విధానాలను అవలంబిస్తుందని భారత రాజ్యాంగం స్థానంలో మన ధర్మ శాస్త్రాన్ని ప్రవేశపెట్టాలని చూస్తుందని అన్నారు.
భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత దేశ ప్రజానీకం అందరి సందర్భంగా ఆయన విగ్రహాలకు , ఫోటోలకు దండలు వేసి దండాలు పెట్టడం ఆయనకు ఇచ్చే నివాళి కాదని ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత దేశ ప్రజలందరి పైన ముఖ్యంగా యువత పైన ఉందని ఆ విధంగా అందరూ ఆయన అడుగుజాడల్లో ముందుకెళ్లాలని అన్నారు.ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు మోర అజయ్ , గడ్డం రాజశేఖర్ , కంది మల్లేశం , బింగి సంపత్ , సందుపట్ల పోచమల్లు , బింగి సతీష్ తదితరులు పాల్గొన్నారు.