తన మేధో సంపత్తితో జీవితాన్ని ధారపోసినమహానుభావుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ :

జడ్పి చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవ రెడ్డి రాజన్న సిరిసిల్ల జిల్లా :బడుగు బలహీన, మైనార్టీ వర్గాల అభ్యున్నతి, స్వావలంబన కోసం తన మేధో సంపత్తితో జీవితాన్ని ధారపోసిన మహానుభావుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవ రెడ్డి కొనియాడారు.

 The Great Dr. Br Ambedkar Who Gave His Life With His Intellectual Wealth , Aruna-TeluguStop.com

కోనరావుపెట్ మండలం రామన్నపేట గ్రామంలో భారతరత్న డా బి ఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జడ్పి చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి.ఈ కార్యక్రమంలో చైర్ పర్సన్ మాట్లాడుతూ అంబేడ్కర్ జయంతి రోజు అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషకరం అన్నారు.

బడుగు బలహీన, మైనార్టీ వర్గాల అభ్యున్నతి, స్వావలంబన కోసం తన మేధో సంపత్తితో జీవితాన్ని ధారపోసిన మహానుభావుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని కొనియాడారు.వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కంకణ బద్దులు కావాలని పిలుపునిచ్చారు.రాజ్యాంగం ద్వారా కుల మతా లకు అతీతంగా, లింగ బేధం లేకుండా, ధనిక పేద అనే తారతమ్యం లేకుండా వయోజునులైన ప్రతీ ఒక్కరి పాలకులను ఎన్నుకునే ఓటు హక్కును కల్పించిన మహోన్నతుడు భారతరత్న డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ అని కీర్తించారు.

సమ సమాజ నిర్మాణం కోసం అన్ని వర్గాల ప్రజలు అర్థికంగా, సామాజికంగా ఎదిగేందుకు రిజర్వేషన్‌ తీసుకొచ్చాడని అన్నారు.హైదరాబాద్ లో సచివాలయం సమీపంలో మహా విగ్రహం ఏర్పాటు తో భారతరత్న డా బి ఆర్ అంబేద్కర్ గొప్పతనం ప్రపంచానికి తెలిసిందన్నారు.

నూతన రాష్ట్ర సచివాలయం కు భారతరత్న డా బి ఆర్ అంబేద్కర్ పేరు పెట్టడం హర్షణీయం అన్నారు.ప్రభుత్వాలు పేదల కోసం సంక్షేమ పథకాల ఫలాలు అందిస్తున్నాయంటే అది అంబేడ్కర్‌ రాసిన రాజ్యాంగం ద్వారానేనని అన్నా రు.భారతరత్న డా బి ఆర్ అంబేద్కర్ ఆలోచన అమలుకు సిఎం కేసిఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.డా బి ఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని అన్నారు.

వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ సంతోష్, ఎంపీటీసీ మల్లేష్, నాయకులు, పాక్స్ చైర్మన్ రాంమోహన్ రావు, పాక్స్ డైరెక్టర్ నాగిరెడ్డి, కుల సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube