హీరోయిన్లకు వయసే పెద్ద సమస్య... షాకింగ్ కామెంట్స్ చేసిన అల్లు అర్జున్ హీరోయిన్?

అల్లు అర్జున్( Allu Arjun ) తనని ట్విట్టర్లో బ్లాక్ చేశారంటూ ఒక్కసారిగా సెన్సేషనల్ అయ్యారు నటి భాను శ్రీ మెహ్రా( Bhanu Sree Mehra ).ఈమె 2010వ సంవత్సరంలో గుణశేఖర్( Gunasekhar ) దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన వరుడు సినిమా( Varudu Movie ) ద్వారా హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.

 Age Is A Big Problem For Heroines Is Allu Arjun A Heroine Who Made Shocking Com-TeluguStop.com

అయితే ఈ సినిమా డిజాస్టర్ కావడంతో ఈమెకు పెద్దగా అవకాశాలు కూడా రాలేదు.ఇలా సినిమా అవకాశాలు రాకపోవడంతో చిన్న చిన్న పాత్రలలో నటిస్తున్నటువంటి భాను శ్రీ ప్రస్తుతం ఇండస్ట్రీకి పూర్తిగా దూరమయ్యారు.

ఇలా ప్రేక్షకులు అందరూ ఈమెను మర్చిపోతున్న తరుణంలో అల్లు అర్జున్ తనని బ్లాక్ చేశారంటూ ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించారు.

ఇలా సోషల్ మీడియాలో యాక్టివ్ అయినటువంటి ఈమె ఇండస్ట్రీ గురించి పలు విషయాలను మాట్లాడుతూ వార్తల్లో నిలుస్తున్నారు.అయితే తాజాగా ఈమె హీరోయిన్ల గురించి మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేశారు.ఇండస్ట్రీలో హీరోయిన్లు ఎక్కువ కాలం పాటు కొనసాగలేరనే విషయం మనకు తెలిసిందే.

కాస్త వయసు పైబడిన వారిని హీరోయిన్ గా కాకుండా ఇతర పాత్రలలో నటించడానికి అవకాశాలు కల్పిస్తూ ఉంటారు.ఇక పెళ్లి జరిగితే సెకండ్ హీరోయిన్ గా ఛాన్సల్ ఇస్తూ ఉంటారు.

ఇక ఈ విషయం గురించి ఈమె మాట్లాడుతూ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ల వయసు విషయంలో చాలా వివక్షత చూపిస్తున్నారని తెలియజేశారు.ఇలా ఇండస్ట్రీలో హీరోయిన్లకు ఎదురయ్యే ప్రధాన సమస్య వయస్సు.హీరోలు ఎంత వయసు వచ్చిన ప్రేమ కథ చిత్రాలలో నటిస్తారు.వారి కన్నా సగం వయసు ఉన్నటువంటి హీరోయిన్లతో రొమాన్స్ చేస్తారు.కానీ ఒక హీరోయిన్ ఇండస్ట్రీలో ఐదారు సంవత్సరాల పాటు కొనసాగిన లేదా వారికి పెళ్లి అయినా హీరోయిన్ గా అవకాశాలు పోతాయని వారిని తల్లి పాత్రలకు మాత్రమే అడుగుతూ ఉంటారని ఇండస్ట్రీలో ఈ ధోరణి మారాలి అంటూ ఈ సందర్భంగా ఈమె చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube