మనలో దాదాపుగా అందరికీ తత్కాల్ టికెట్ ( Tatkal ticket )గురించి తెలిసే ఉంటుంది.అయితే ప్రీమియం తత్కాల్ టికెట్ గురించి మాత్రం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.
తత్కాల్లో అంటే రైలు ప్రయాణానికి( train ) ఒక రోజు ముందు బుకింగ్ చేసుకోవలసి ఉంటుంది.చివరి నిమిషంలో జర్నీ ప్లాన్ చేసుకునేవారికి తత్కాల్ టికెట్ ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటుంది.
ఇక వారం పది రోజులు లేదా అంతకన్నా ముందు జర్నీ ప్లాన్ చేసుకునేవారికి సాధారణ రిజర్వేషన్ ద్వారా టికెట్లు చేసుకోవచ్చు.అయితే చివరి నిమిషంలో జర్నీ ప్లాన్ చేసుకునేవారికి తాత్కాల్ టికెట్ ద్వారానే కాకుండా ప్రీమియం తత్కాల్ బుకింగ్( Premium Tatkal Booking ) కూడా చేసుకోవచ్చు.
అవును, తత్కాల్‌తో పాటు ప్రీమియం తత్కాల్ కూడా ప్రయాణికులను ఓ మంచి ఆప్షన్.భారతీయ రైల్వేలు తత్కాల్ సదుపాయాన్ని పోలి ఉండే మరో కొత్త కోటాను ప్రారంభించింది.ప్రీమియం తత్కాల్ కోటాలో కూడా తత్కాల్ లాగానే బుకింగ్ చేసుకోవచ్చు.ఇక దీని బుకింగ్ కూడా తత్కాల్ లాగా ఒక రోజు ముందు ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది.
ఏసీ క్లాస్ టికెట్ల బుకింగ్ ఉదయం 10 గంటల నుంచి ప్రారంభం కాగా, నాన్ ఏసీ క్లాస్ టికెట్ల కోసం ఉదయం 11 గంటల నుంచి బుకింగ్ స్టార్ట్ అవుతుంది.ఇందులో తత్కాల్ టికెట్ బుకింగ్ కంటే ఎక్కువ ధర ఉంటుంది.
ప్రీమియం తత్కాల్ కేటగిరీలో ఛార్జీలు మారుతూ ఉంటాయి.ఇందులో టిక్కెట్లకు డిమాండ్ ఉంటే.తత్కాల్ కంటే టికెట్ రేటు చాలా ఎక్కువగా ఉంటుంది.అలాగే, ఈ టిక్కెట్‌ను IRCTC అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే బుక్ చేసుకోవచ్చు.అయితే తత్కాల్‌ను IRCTC కాకుండా అనేక వెబ్సైట్ల ద్వారా బుక్ చేసుకోవచ్చు.తత్కాల్ టిక్కెట్లు ఏ సమయంలో అమ్ముడవుతాయో.
అదే విధంగా ప్రీమియం తత్కాల్లో టిక్కెట్లు అమ్ముడవడానికి కూడా కొంత సమయం పడుతుంది.దీన్ని బుకింగ్ చేయడానికి కూడా రూల్స్ తత్కాల్ లాగానే ఉంటాయి.