కరోనా అనంతరం ముఖ్యంగా మోటార్ ఫీల్డ్ లో పెను మార్పులే సంభవించాయని చెప్పుకోవచ్చు.నానాటికీ ఆయిల్ ధరలు పెరిగిపోవడంతో వాహనదారులు ఎలక్ట్రిక్ వెహికల్స్ పై( EV ) మొగ్గు చూపడం జరిగింది.
దాంతో చాలా కంపెనీలు ఎలక్ట్రిక్ విహికల్స్ ని మార్కెట్లోకి తీసుకు వచ్చాయి.అందులో చాలావరకు సక్సెస్ అయినాయి.
అయితే దేశీయంగా చూసుకుంటే చిన్న, చితకా కంపెనీలు తప్ప… పెద్ద కంపెనీలు మాత్రం తమ ఉత్పత్తులను మార్కెట్లోనికి తీసుకురాని పరిస్థితి.ఇక అందుబాటులో వాటిల్లోనే ది బెస్ట్ ను వినియోగదారులు ఎంపిక చేసుకోవాల్సి వస్తోంది.
ఈ తరుణంలో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు సంపాదించిన ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనాల తయారీదారు ‘గొగొరో’( Gogoro ) తన రెండు ఈవీలను భారతీయ మార్కెట్లో కి తీసుకొచ్చింది.మార్చుకోదగిన బ్యాటరీలను అందించడంలో అగ్రశ్రేణి కంపెనీగా గొగొరోకి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉందనే విషయం తెలిసినదే.ఇది ఇప్పుడు విజయవంతమైన హోమోలోగేషన్ సర్టిఫికేషన్ తో గొగొరో2, గొగొరో 2 ప్లస్ సిరీస్ ను మన దేశంలోకి తీసుకువస్తోంది.ఈ వాహనాలను సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రోడ్ ఇన్‌స్టిట్యూట్ ధ్రువీకరించింది కూడా.
ఇక వీటి స్పెసిఫికేషన్ల విషయానికొస్తే, గొగొరో 2, 2 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్లు రెండూ గరిష్టంగా 87 kmph వేగంతో ప్రయాణించగలగుతాయి.అదేవిధంగా గొగొరో పవర్ అవుట్ పుట్ 7.2 kW, గొగొరో 2 ప్లస్ 6.4 kW అందిస్తాయి.గొగొరో 2( Gogoro 2 ) సింగిల్ చార్జ్ పై 85 కిలోమీటర్లు, 2 ప్లస్ వాహనం అయితే 97 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది.రెండు ఇ-స్కూటర్‌లు 1295 మిమీ పొడవాటి వీల్‌బేస్‌ను కలిగి ఉన్నాయి, ఇది టీవీఎస్ జూపిటర్ 125 కంటే పొడవుగా ఉంటుంది.
దాని పొడవు 1275మిమీ.ఇక వాహనాల బరువు ఒక్కొక్కటి 273కిలోలు వరకు ఉంటాయి.
భద్రతా లక్షణాలతో పాటు గొగొరో 2 ప్లస్ ప్రీమియం లుక్ అదరగొడుతుంది.నిగనిగలాడే మెటాలిక్ బాడీ ప్యానెల్‌లు, మెటాలిక్ సీట్ బ్యాడ్జ్ చూపరులను కట్టిపడేస్తాయి.