బ్యాంకర్లు రుణాల లక్ష్యాన్ని చేరుకోవాలని, వివిధ పథకాల కింద ఎంపికైన లబ్ధిదారులకు రుణాలు త్వరగా మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు.సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి బ్యాంకర్ల సంప్రదింపుల కమిటీ సమావేశం జరిగింది.
జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ మల్లిఖార్జున్ వార్షిక ప్రణాళిక రుణాల లక్ష్యం సాధింపులను వివరించారు.ఆర్థిక సంవత్సరం రుణాల లక్ష్యం రూ.2725 కోట్లుగా నిర్ణయించగా.ఇప్పటి వరకూ బ్యాంకర్ లు రూ.1850 కోట్ల మంజూరు చేశామని తెలిపారు.ఎంఎస్ఎంఈ రుణ లక్ష్యం రూ.566 కోట్లు కాగా 196 కోట్లు పంపిణీ చేసినట్లు జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ మల్లిఖార్జున్ వివరించారు.ఆయా రంగాలకు రుణాల పంపిణీలో నిర్దేశిత లక్ష్యాలను పూర్తి స్థాయిలో సాధించేందుకు బ్యాంకర్లు కృషి చేయాలని కలెక్టర్ సూచించారు.
ప్రత్యేకించి రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యవసాయాధారిత ప్రాంతమైనందున పంట రుణాల పంపిణీకి అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.అగ్రికల్చర్ టర్మ్ లోన్, వ్యవసాయ మౌలిక సదుపాయాల ఫండ్, పీఎం ఎఫ్ ఎం ఈ లక్ష్యాల సాధనకు కృషి చేయాలని చెప్పారు.
మెప్మా పట్టణ స్వయం సహాయక సంఘాలకు రుణాల మంజూరులో నిర్దేశిత లక్ష్యం కంటే మించి 145% లక్ష్యాన్ని సాధించడం పట్ల జిల్లా కలెక్టర్ హర్షం వ్యక్తం చేశారు.బ్యాంకర్ లకు అభినందనలు తెలిపారు.
అదే విధంగా గ్రామీణ స్వయం సహాయక సంఘాలకు నిర్దేశించిన లక్ష్యాల సాధనకు కూడా కృషి చేయాలని బ్యాంకర్లకు సూచించారు.అలాగే అగ్రికల్చర్ ఇన్ఫాస్ట్రక్చర్ ఫండ్ కింద వచ్చే దరఖాస్తులకు ప్రాధాన్యత నిస్తూ విరివిగా రుణాలు మంజూరు చేయాలన్నారు.
జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్న మిల్చి స్కీమ్ ( రెండు పాడి గేదెల స్కీం) కింద జిల్లాలో ఇప్పటికే 1120 దరఖాస్తులు చేసుకోగా … 602 మంది లబ్ధిదారులకు రుణాలను ఇచ్చేందుకు బ్యాంకులు సమ్మతి తెలియజేశాయన్నారు.ఇంకా 880 మంది ఎస్సీ దరఖాస్తుదారులకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉందన్నారు.లబ్ధిదారులతో బ్యాంకు మేనేజర్లు నేరుగా మాట్లాడి వారికి సాధ్యమైనంత త్వరగా బ్యాంకు సమ్మతి పత్రాలను అందించి యూనిట్లను గ్రౌండింగ్ కు సహకరించాలని బ్యాంకర్ లకు జిల్లా కలెక్టర్ సూచించారు.
నాబార్డ్ వారిచే రాజన్న సిరిసిల్ల జిల్లా 2023-24 పొటెన్షియల్ లింక్డ్ క్రెడిట్ ప్లాన్ విడుదల చేసిన జిల్లా కలెక్టర్
నాబార్డ్ వారిచే పొటెన్షియల్ లింక్డ్ క్రెడిట్ ప్లాన్ 2023-24 సంవత్సరానికి గాను రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారిచే ఆవిష్కరించబడినది.ఇందులో వార్షిక ప్రణాళికతో గాను క్రాప్ లోన్లకు రూపాయలు 1401.85 కొట్లు టర్మ్ లోన్లకు 1763.13 కోట్లు ఎమ్మెస్ ఎంఈలకు 640.75 కోట్లు మొత్తం ప్రాధాన్యత రంగానికి 2834.34 కొట్లు ప్రణాళిక రూపొందించడం జరిగింది.ఈ ప్రణాళిక ఆధారంగా జిల్లా వార్షిక రుణ ప్రణాళికను నిర్ణయించడం జరుగుతుంది.
ఈ సమావేశంలో జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ టి ఎన్ మల్లి ఖార్జున్, యు బి ఐ బ్యాంక్ డిప్యూటీ రీజినల్ హెడ్ టీ వంశీకృష్ణ, ఆర్బిఐ ఎల్ డి ఓ రాజేంద్ర ప్రసాద్, నాబార్డ్ డీడీఎం పి మనోహర రెడ్డి, ఎస్బిఐ ఆర్ ఎం రవి శేఖర్, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఆర్ ఎం బి గంగాధర్, కేడీసీసీబీ సీఈఓ ఎన్ సత్యనారాయణ , జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.