కాంగ్రెస్లో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో ఎవరికి మెజార్టీ రాదని, హంగ్ వస్తుందంటూ కోమటిరెడ్డి వ్యాఖ్యనించిన సంగతి తెలిసిందే.
రాష్ట్రంలో ఎన్నికల తరువాత కేసీఆర్ తో పొత్తు పెట్టుకుంటామంటూ కామెంట్స్ చేశారు.అయితే కోమటిరెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ఈ క్రమంలోనే పార్టీ హైకమాండ్ కు ఫిర్యాదులు చేస్తున్నారు.ఆయన పార్టీకి నష్టం చేసేలా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు.
తరచూ బీజేపీ నేతలను కలుస్తూ కాంగ్రెస్ ను బలహీనం చేసేలా వ్యవహరిస్తున్నారంటూ ధ్వజమెత్తారు.రేవంత్ రెడ్డి పాదయాత్రతో కాంగ్రెస్ కు ఊపు వస్తున్న సమయంలో కోమటిరెడ్డి కావాలనే చేశారని నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు పార్టీ ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే ఇవాళ సాయంత్రం వస్తున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.