'జైలర్'లో అలా కనిపించబోతున్న సూపర్ స్టార్!

సూపర్ స్టార్ రజనీ కాంత్ గురించి ప్రతీ ఒక్కరికి తెలుసు.ఈయనను ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు.

 Rajinikanth's Jailer Movie Latest Update , Rajinikanth, Jailer Movie, Nelson Dil-TeluguStop.com

రజనీకాంత్ కోలీవుడ్ స్టార్ అయినప్పటికీ ఇండియన్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకుని ఫ్యాన్స్ చేత సూపర్ స్టార్ గా మన్ననలు పొందుతున్నాడు.రజనీకాంత్ సినిమాల కోసం ఒకప్పుడు థియేటర్స్ దగ్గర నానా హంగామా చేసేవారు.

కానీ మారుతున్న ప్రేక్షకుల అభిరుచి కారణంగా ఈ మధ్య రజనీకాంత్ చేస్తున్న సినిమాలు అంతగా హిట్ అందుకోలేక పోతున్నాయి.అయితే ఇప్పటికీ రజనీకాంత్ మంచి కంటెంట్ తో వస్తే హిట్ అందుకోవడం ఖాయం.

ఈ క్రమంలోనే రజనీకాంత్ ఈసారి ”జైలర్” సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతున్నాడు.ఎప్పటిలా కాకుండా ఈ సినిమాపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి.

Telugu Jailer, Kollywood, Rajinikanth, Jailer Latest-Movie

ఈ మధ్య కాలంలో రజనీకాంత్ సినిమాల్లో ఇంత హైప్ ఏర్పరుచుకున్న సినిమా ఇదే కావడం విశేషం.కోలీవుడ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రెజెంట్ శరవేగంగా షూటింగ్ జరుపు కుంటుంది. షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో మేకర్స్ వరుస అప్డేట్ లను అందిస్తూ ఈ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.ఇక ఈ సినిమా నుండి తాజాగా మరో అదిరిపోయే అప్డేట్ వచ్చింది.

Telugu Jailer, Kollywood, Rajinikanth, Jailer Latest-Movie

ఇప్పటికే ఈ సినిమా ఒక రాత్రిలోనే నడిచే కథ అని హింట్ వచ్చింది.ఇక ఇప్పుడు రజనీకాంత్ పాత్రపై మరో అప్డేట్ బయటకు వచ్చింది.రజనీ కాంత్ రోల్ జైలులో వర్క్ చేస్తున్న జైలర్ లా కాకుండా.ఒక రిటైర్డ్ జైలర్ గా కనిపించ నున్నారట.ఈ సినిమాలో ఈయన పాత్ర ఇలానే ఉండనుందట.ఇదిలా ఉండగా ఈ సినిమాలో రజినీకాంత్ సరసన తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.

సన్ పిక్చర్స్ వారు భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube