తెలుగు సినిమా పరిశ్రమ మరో దిగ్గజ దర్శకుడుని కోల్పోయింది.92 ఏళ్ల వయసు లో కళాతపస్వి కాశీనాథుని విశ్వనాథ్ మృతి చెందిన విషయం తెలిసిందే.ఎన్నో అద్భుతమైన తెలుగు సినిమా లను తెలుగు ప్రేక్షకులకు అందించిన విశ్వనాథ్ ఆస్కార్ కి మన సినిమా ను పరిచయం చేశాడు.1985 సంవత్సరం లో కమల్ హాసన్ హీరో గా విశ్వనాథ్ దర్శకత్వం లో వచ్చిన స్వాతిముత్యం చిత్రం ఏకంగా ఆస్కార్ అవార్డు కు నామినేట్ అయింది.
ఆస్కార్ కి నామినేట్ అయిన తొలి తెలుగు చిత్రం గా స్వాతి ముత్యం ఘన కీర్తి కి ఎక్కింది.తమిళం మరియు తెలుగు లో కలిపి మొత్తం 30 సినిమాల వరకు ఆయన నటించారు.దర్శకుడిగా మరియు నటుడిగా ఆయన సాధించిన ఘన కీర్తి ఉన్నత శిఖరం అనడంలో సందేహం లేదు.
తెలుగు సినీ చరిత్ర ఉన్నంత కాలం ఆయన దర్శకత్వం లో వచ్చిన శంకరాభరణం సినిమా ఉంటుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు.
సంగీతం మరియు కమర్షియల్ ఎలిమెంట్స్ తో రూపొందిన ఆ సినిమా ఇప్పటికి ఎప్పటికీ ఒక అద్భుతమే అనడం లో సందేహం లేదు.విశ్వనాథ్ యొక్క ప్రతి చిత్రం కూడా ప్రత్యేకమైన అని చెప్పాలి.
శంకరాభరణం సినిమా 1980 ఫిబ్రవరి 2వ తారీఖున విడుదల అయింది.మొత్తానికి రాజమౌళి కంటే ముందే మన తెలుగు సినిమాను ఆస్కార్ కి పరిచయం చేసిన గొప్ప దిగ్గజ దర్శకుడు కళాతపస్వి కే విశ్వనాథ్ మృతి చెందడం తెలుగు సినీ జగత్తుకి తీరని లోటు.ఆయన లేని లోటు ని మరెవ్వరు కూడా భర్తీ చేయలేరు.ఆయన వేసిన దారి లో వందలాది మంది ఫిలిం మేకర్స్ అడుగులు వేస్తున్నారు.ఆయన సినిమాలు ఎప్పటికీ ఉంటాయి అంటే ఆయన మనతో ఉన్నట్లుగానే భావించవచ్చు.