సోషల్ మీడియా ప్రభావం రానురాను విపరీతంగా పెరిగిపోతోంది.స్మార్ట్ ఫోన్స్ వాడకం విరివిగా పెరిగాక, టారిఫ్ చార్జులు కూడా అందుబాటు ధరలలో వచ్చాక రకరకాల సోషల్ మీడియాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి.
ఆటవిడుపుగా నేడు జనాలకి అవి ఉపయోగపడుతున్నాయి.దాంతో ఖాళీగా వున్నవారు అయితే గంటలు తరబడి సోషల్ మీడియాలోనే కాపురం చేస్తున్నారు.
సోషల్ మీడియాలో నిత్యం లక్షల్లో వీడియోలు అప్లోడ్ అవుతూ ఉంటాయి.అయితే అందులో కొన్ని మాత్రమే నెటిజన్లను ఆకట్టుకుంటాయి.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తాజా వీడియో ఒకటి చూపరులను ఆకట్టుకోవడమే కాకుండా ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తోంది.అవును, బెంగళూరులో ఓ వ్యక్తి చేసిన పనికి స్థానికులు, పోలీసులు సైతం ఆశ్చర్యపోయారు.ఇక్కడ వీడియోని ఒకసారి గమనిస్తే, స్కూటర్ పై కరెన్సీ నోట్ల బ్యాగుతో ఓ ఫ్లైఓవర్ పైకి చేరుకున్న వ్యక్తి తన దగ్గర వున్న బ్యాగ్ నుండి రూ.10 నోట్లను తీసి ఫ్లైఓవర్ పై నుంచి కిందకు వెదజల్లడం మొదలు పెట్టాడు.ఫ్లైఓవర్ పైన రెండు వైపులకు వెళ్తూ రెండు వైపుల నుంచి నోట్ల వర్షం కరుపించడం మొదలుపెట్టాడు.ఇక ఉన్నట్టుండి ఫ్లైఓవర్ పై నుంచి నోట్లు వచ్చి పడుతుండటంతో జనం వాటిని ఏరుకోవడం మొదలుపెట్టారు.
ఇంకేముంది కట్ చేస్తే, ఫ్లై ఓవర్ కింద చౌరస్తాలో రోడ్డు పక్కనే తమ వాహనాలను నిలిపి కొందరు, బాటసారులు కొందరు కరెన్సీ నోట్లు ఏరుకునేందుకు పోటీ పడడంతో ట్రాఫిక్ కిక్కిరిసిపోయింది.అంతేకాకుండా ఫ్లైఓవర్ పైన కూడా అంటే పరిస్థితి.సదరు వ్యక్తి నోట్లు వెదజల్లడం వల్లే ట్రాఫిక్ జామ్ అయిందని గ్రహించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేసినప్పటికీ.అప్పటికే అతడు ఆ ట్రాఫిక్ జామ్లోంచే తుర్రున జారుకోవడం విశేషం.
దీంతో అతడు ఎందుకొచ్చాడు ? ఇలా ముక్కూ మొహం తెలియని జనంపై నోట్లు ఎందుకు వెదజల్లి వెళ్లాడు అనే విషయం అర్థం కాక పోలీసులు తలగోక్కుంటున్నారు.