స్టార్ హీరోయిన్ నయనతార వయస్సు ప్రస్తుతం 38 సంవత్సరాలు అనే సంగతి తెలిసిందే.వయస్సు పెరుగుతున్నా నయనతార మరింత అందంగా కనిపిస్తూ అంతకంతకూ ఆకట్టుకుంటున్నారు.
ఇప్పటికీ నయనతార యంగ్ గా కనిపిస్తున్నారనే సంగతి తెలిసిందే.అయితే నయనతార యంగ్ గా కనిపించడం వెనుక కారణమేంటనే ప్రశ్నకు ఆసక్తికర సమాధానం వినిపిస్తోంది.
నయనతార తన అందం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారని బోగట్టా.
సహజ ఉత్పత్తులను, ఆయుర్వేద ఉత్పత్తులను ఆమె ఎక్కువగా వినియోగిస్తారని కెమికల్స్ ఎక్కువగా ఉన్న ఉత్పత్తులు ఆమెకు అస్సలు నచ్చవని సమాచారం అందుతోంది.
ఆరోగ్యానికి మేలు చేసే ఆహారానికి మాత్రమే ఆమె ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారని సమాచారం.శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోవాలని ఆమె భావిస్తారని ఇందుకోసం ఆమె ప్రతిరోజూ 3 లీటర్ల కంటే ఎక్కువ నీటిని తీసుకుంటారని తెలుస్తోంది.
తెలుగులో ఒకప్పుడు యంగ్ హీరోలకు జోడీగా నటించిన నయనతార ఇప్పుడు మాత్రం సీనియర్ హీరోలకు జోడీగా నటించారు.ఎలాంటి ఆరోగ్య సమస్య వచ్చినా వెంటనే చికిత్స తీసుకోవడం ద్వారా నయనతార ఆ సమస్యకు చెక్ పెడతారని తెలుస్తోంది.భారీగా పారితోషికాన్ని అందుకునే ఈ బ్యూటీ ఆ మొత్తంలో పదో వంతు సేవా కార్యక్రమాల కోసమే ఖర్చు చేస్తారని సమాచారం అందుతోంది.
నయనతార గురించి పూర్తిగా తెలిసిన వాళ్లు ఆమె మనస్సు బంగారం అని చెబుతారు.నయనతార విఘ్నేష్ శివన్ జోడీ బాగుంటుందని ఈ జోడీ క్యూట్ జోడీ అని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.విఘ్నేష్ శివన్ డైరెక్షన్ లో తెరకెక్కనున్న కొత్త ప్రాజెక్ట్ లలో మాత్రం నయనతార హీరోయిన్ గా నటించడం లేదని బోగట్టా.
స్టార్ హీరోయిన్ నయనతార రెమ్యునరేషన్ మరీ ఎక్కువగా ఉండటంతో టాలీవుడ్ నిర్మాతలు ఆమెకు బదులుగా ఇతర హీరోయిన్లను ఎంచుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు.