పులిలా మారిన కుక్క... భయంతో పరుగులంకిస్తున్న జనం!

అదేంటి కుక్క పులిలా మారడం ఏమిటి? అదెలా సాధ్యం అని అనుకుంటున్నారా? అక్కడే వుంది అసలు ట్విస్ట్.అదేంటో తెలియాలంటే మీరు ఈ కధ మొత్తం చదవాల్సిందే.

 A Dog That Turned Into A Tiger People Running In Fear , Dog, Viral Latest, News-TeluguStop.com

కర్ణాటకలోని చామరాజనగర్‌లో జరిగిన ఓ ఘటన స్థానికులను భయబ్రాంతులకు గురి చేస్తోంది.అవును, ఇక్కడి ఊర్లో డిగ్గర్ అనే కుక్క వింతగా టైగర్ రూపంలో అకస్మాత్తుగా ప్రత్యక్షమైయే సరికి అక్కడి జనాలకి ఏం చేయాలో పాలుపోలేదు.

అది అచ్చం పులిలాగా వారిని భ్రమింపజేయడంతో ఒక్కొక్కరికి తడిపోయినంత పని అయింది.

అక్కడ హనూర్ తాలూకా అజ్జీపురా గ్రామంలో పులి వేషధారణలో కుక్క సంచరించడంతో జనాలు పులి వస్తుందనే భయంతో తమ ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు తీశారు.కట్ చేస్తే పులి రూపంలో ఉన్నది కుక్క అని తెలిసి అందరూ ముక్కునవేలేసుకున్నారు.విషయంలోకి వెళితే, అక్కడ ఎవరో ఓ అజ్ఞాత రైతు ఈ కుక్కను పులి వేషంలోకి మార్చేసినట్టు వారు తెలుసుకున్నారు.

పొలంలో పండే పంటలను వన్యప్రాణుల బారి నుంచి కాపాడేందుకే అలా చేసినట్టు తెలిసి ఒక్కసారిగా స్థానికులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని నవ్వుకున్నారు.

రైతులు తమ పంటల్ని కాపాడుకొనేందుకు ఇలాంటి ట్రిక్స్ ఎన్నింటినో వినియోగిస్తూ వుంటారు. కొబ్బరి చెట్లకు మనిషి బొమ్మను వేలాడదీయడం, లౌడ్ స్పీకర్స్ పెట్టడం, గంటలు మోగించటం వంటివి చేస్తుంటారు.అయితే, ఇక్కడ రైతు మాత్రం కాస్త వినూత్న ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది.

ఇకపోతే వీధి కుక్కను పులి రూపంలో చూసి అడవి జంతువులు, కోతులు భయపడుతున్నాయో, లేదో తెలియదు గానీ అక్కడి వాహనదారులు, స్థానికులు, అపరిచితులు మాత్రం దానిని చూసి భయబ్రాంతులకు గురైనట్టు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube