రండి రండి బీఆర్ఎస్ లో చేరండి..! చేరితే మీకెంతో లాభమండి ! 

ఇప్పుడు ఇదే డైలాగులను చెబుతూ… ఏపీ నేతలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు.ఏపీలో బాగా వేసేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఆ పార్టీ అధినేత కేసిఆర్ భావిస్తున్నారు.

 Kcr Appointed Thota Chandrasekhar As President Of Brs In Ap , ,kcr Appointed-TeluguStop.com

ఇప్పటికే ఏపీకి చెందిన ముగ్గురు కేంద్ర సర్వీసుల మాజీ అధికారులు పార్టీలో చేరిపోయారు.బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడుగా రిటైర్డ్ ఐఏఎస్ తోట చంద్రశేఖర్ ను కేసిఆర్ నియమించారు.

ఇక పూర్తిగా చేరికలపైనే దృష్టి పెట్టాల్సిందిగా కెసిఆర్ సూచించడంతో బీఆర్ఎస్ కీలక నేతలు రంగంలోకి దిగిపోయారు.ఏపీలో వివిధ రాజకీయ పార్టీల్లో ఉన్న అసంతృప్త నేతలను గుర్తించి తమ పార్టీలో చేరాల్సిందిగా ఆహ్వానాలు పలుకుతున్నారు.

పార్టీలో చేరితే ముందు ముందు జరగబోయే లబ్ధి ఏ విధంగా ఉంటుందని విషయాన్ని ప్రస్తావిస్తూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

    ప్రస్తుతం వివిధ పార్టీల్లో ఉన్న అసంతృప్త నేతలతో పాటు , తటస్థంగా ఉంటూ నియోజకవర్గ స్థాయిలో రాజకీయాలను శాసించగల వ్యక్తులను, ప్రజల్లో పట్టున్న వారిని పార్టీలో చేర్చుకునే వ్యూహంలో కేసీఆర్ ఉన్నారు.

దీనిలో భాగంగానే కోస్తా రాయలసీమ ప్రాంతాల్లో తమ పార్టీకి అనుకూల పరిస్థితులు ఉంటాయని పెద్ద ఎత్తున నాయకులు చేరతారని ఆశతో ఉన్నారు.ఇప్పటికే కీలక నేతలు కొంతమందితో కేసీఆర్ చర్చించినట్లు సమాచారం.

ముఖ్యంగా ఏపీకి చెందిన కొంతమంది కీలక వ్యక్తులు తెలంగాణలో భారీ ఎత్తున వ్యాపార , వ్యవహారాలు చేస్తుండడంతో వారిని తమ పార్టీలోకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నారట.బీఆర్ఎస్ లో చేరడం ద్వారా తెలంగాణలోనూ మీ వ్యాపార వ్యవహారాలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసే బాధ్యత తమదని,  అన్ని రకాలుగాను ఉపయోగకరంగా ఉంటుందని,  తగిన ప్రాధాన్యం పార్టీలో ఇస్తామని చెబుతూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారట.
   

Telugu Ap Brs, Janasena, Telangana, Ysrcp-Political

 మరికొంతమందికి ఆర్థికంగానూ సహాయం చేస్తామని హామీని కూడా ఇస్తున్నారట.ఈ విధంగా అన్ని ప్రాంతాల్లోనూ… అన్ని వర్గాల నాయకులను పెద్ద ఎత్తున చేర్చుకుని బలమైన శక్తిగా ఏపీలో ఎదిగేందుకు బీఆర్ఎస్ భారీగానే వ్యవహారాలు రచిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube