ఫోన్‌పే, పేటీఎం, గూగుల్‌ పే, అమెజాన్‌ పే ట్రాన్సాక్షన్స్‌పై లిమిట్‌ ఇదే!

దేశ ప్రధాని ఏ ముహూర్తంలో ‘డిజిటల్‌ ఇండియా’ నినాదం ఎత్తుకున్నాడోగాని దాని ఎఫెక్ట్ జనాలలో బాగానే వుంది.నేడు ఎక్కడ చూసినా చదువుతో నిమిత్తం లేకుండా UPI పేమెంట్స్‌ కనబడుతున్నాయి.

 Know Transaction Limit For Phonepe Paytm Gpay Amazonpay Details,  Phone Pay, Goo-TeluguStop.com

రోడ్డు పక్కన చాయ్ వాలా తో పాటు పెద్ద పెద్ద మాల్స్ లో కూడా UPI విధానంలోనే చెల్లింపులు జరుగుతున్నాయి.అవును, నేడు డిజిటల్‌ పేమెంట్స్‌ అనేవి డిజిటల్‌ ఇండియా పిలుపుకి మద్దతుగా నిలిచాయని చెప్పవచ్చు.

ఎందుకంటే, డిజిటల్ పేమెంట్‌ పద్ధతి అనేది దాదాపు ప్రతిచోటా అందుబాటులో ఉంది కాబట్టి.స్మార్ట్‌ఫోన్‌ నుంచి సులువుగా పేమెంట్స్‌ చేయడానికి వీలు ఉండడంతో తక్కువ కాలంలోనే UPI పాపులర్‌ అయిపోయింది.

గూగుల్‌ పే, ఫోన్‌పే, పేటీఎం, అమెజాన్‌ పే వంటి యాప్‌లు ఇపుడు మార్కెట్ ని కొత్త పుంతలు తొక్కిస్తున్నాయి.ఈ క్రమంలోనే ఇప్పుడు ప్రతిరోజూ చేసే UPI ట్రాన్సాక్షన్‌లపై లిమిట్‌ పెట్టారని మీకు తెలుసా?

వివరాల్లోకి వెళితే, NPCI (నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) ప్రకారం, ఒక వినియోగదారుడు ఒక రోజులో UPI ద్వారా రూ.లక్ష వరకు మాత్రమే ట్రాన్స్‌ఫర్‌ చేయాలి.అయితే ఒక రోజులో UPI ద్వారా ట్రాన్స్‌ఫర్‌ చేయగల మొత్తం కూడా ఆయా బ్యాంకులు, ఉపయోగిస్తున్న యాప్‌లపై కూడా ఆధారపడి ఉంటుంది అని గుర్తు పెట్టుకోవాలి.

ఉదాహరణకు అమెజాన్‌ పే ద్వారా రోజులో రూ.లక్ష వరకు పేమెంట్స్‌ చేయవచ్చు.అది కూడా పాత కస్టమర్లు అయితేనే.అదే కొత్త వినియోగదారులు అయితే మొదటి 24 గంటల్లో రూ.5,000 వరకు మాత్రమే ట్రాన్స్‌ఫర్‌ చేయగలరని గుర్తు పెట్టుకోవాలి.అలాగే గూగుల్‌ పే విషయంలో కూడా ఇదే వర్తిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube