తెలుగు ప్రేక్షకులకు ఒకప్పటి కమెడియన్ లక్ష్మీపతి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.తెలుగులో ఎన్నో సినిమాలలో కమెడియన్ గా నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నాడు.
తనదైన చెల్లెలు కామెడీ చేస్తూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ ఉంటాడు లక్ష్మీపతి.ఇక తెలుగులో ఆంధ్రుడు, కితకితలు,అల్లరి, పెదబాబు లాంటి ఎన్నో సినిమాలలో తనదైన శైలిలో కామెడీ చేసి ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాడు.
ఇక అప్పట్లో సునీల్ లక్ష్మీపతి కాంబినేషన్లో వచ్చిన కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను ఎప్పటికీ మర్చిపోలేరు అని చెప్పవచ్చు.లక్ష్మీపతి 2008లోనే మరణించిన విషయం తెలిసిందే.
అయితే లక్ష్మీపతి మరణించడానికి ఒక నెల ముందే తమ్ముడు శోభన్ మరణించాడు.
ఆ విధంగా నెల రోజుల వ్యవదిలోనే తండ్రిని బాబాయిని కోల్పోవడంతో చాలా కష్టాలను ఎదుర్కొన్నట్లు లక్ష్మీపతి కూతురు శ్వేతా తెలిపింది.
తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్వేతా లక్ష్మీపతి ఎన్నో విషయాలను వెల్లడించింది.ఈ సందర్భంగా శ్వేతా మాట్లాడుతూ.మహేష్ బాబు నటించిన బాబి సినిమా ఫ్లాప్ అవ్వడం వల్ల కుటుంబం ఆర్థికంగా నష్టపోవాల్సి వచ్చిందని, తన బాబాయ్ ప్రతిష్ట కూడా దెబ్బతిందని ఆమె తెలిపింది.బాబీ సినిమా ఫ్లాప్ తో పాఠం నేర్చుకున్న శోభన్ వర్షం సినిమాని చాలా కసిగా తీయగా,కోల్పోయిన ప్రతిష్ట మొత్తం తిరిగి వచ్చిందని చెప్పుకొచ్చింది శ్వేత.
ఆ తర్వాత రవితేజతో తీసిన చంటి సినిమాతో ఆర్థికంగా నష్టపోవాల్సి వచ్చిందని తెలిపింది.
తన బాబాయ్ చనిపోయినప్పుడు తన తండ్రి జీర్ణించుకోలేకపోయారని అంత్యక్రియల సమయంలో ఆ బాధని మర్చిపోవడానికి తాగి వచ్చారని అది నచ్చక ఆయనతో గొడవ పడ్డానని గొడవపడ్డాను అని తెలిపింది శ్వేత లక్ష్మీపతి. అలాగే తన తండ్రి చనిపోయిన సమయంలో తన తండ్రి తనను పట్టుకుని ఏడ్చేశారని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయింది.అయితే అందరూ ఏడుస్తున్నప్పుడు ఏడవకుండా తాను మాత్రమే అందరూ నిద్ర పోయిన తర్వాత రాత్రులు ఏడ్చేదాన్ని అని చెప్పుకొచ్చింది శ్వేత.
ఇక తన తండ్రి చనిపోయిన తర్వాత అధైర్యపడితే తన తమ్ముళ్లు చిన్నవాళ్ళు అందరూ భయపడతారని ఆ సమయంలో తాను బాధ్యత తీసుకున్నట్లు చెప్పుకొచ్చింది.