మాస్ మహారాజా అంటేనే ఎనర్జిటిక్ హీరో అని పేరు ఉంది.ఈయన ఎనర్జీని ఎవ్వరు కూడా బీట్ చేయలేరు అనే చెప్పాలి.
ఎందుకంటే రవితేజ ఒక సినిమా రిలీజ్ కాకుండానే మరో రెండు సినిమాలు లైన్లో పెడతాడు.అయితే ఒకప్పుడు వరుస హిట్స్ ను ఖాతాలో వేసుకునే ఆయన ఇప్పుడు మాత్రం వరుస ప్లాప్స్ ఎదుర్కొంటున్నాడు.
ఒక్క సూపర్ హిట్ వస్తే.ఆ వెంటనే బ్యాక్ టు బ్యాక్ ప్లాప్స్ ఎదురవుతూనే ఉన్నాయి.
దీంతో రవితేజ రేసులో వెనకబడి పోతున్నాడు.ఇటీవలే రామారావు ఆన్ డ్యూటీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్లాప్ ఎదుర్కున్నాడు.ఇక ప్రెసెంట్ రవితేజ త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ధమాకా సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాను కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు.
ఈ సినిమాతో అయినా అన్ని ప్లాప్స్ ను మరిపించేలా హిట్ కొట్టాలని చూస్తున్నాడు.
ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తి అయి ప్రొమోషన్స్ కూడా స్టార్ట్ చేసారు.
ఇప్పటికే ఈ సినిమా నుండి ప్రేక్షకులను అలరించాయి.
ఇక ఇప్పుడు ఈ సినిమా నుండి ట్రైలర్ రాబోతుంది అని మేకర్స్ అఫిషియల్ గా అనౌన్స్ చేసారు.ఈ సినిమా ట్రైలర్ డిసెంబర్ 15న రిలీజ్ చేస్తున్నట్టుగా మేకర్స్ అఫిషియల్ గా కన్ఫర్మ్ చేసారు.దీంతో ఈ ట్రైలర్ ఎలా ఉంటుందా అని అంతా ఎదురు చూస్తున్నారు.
ఈ సినిమాను క్రిస్మస్ బరిలో దింపబోతున్నారు.డిసెంబర్ 23న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.ఇందులో మాస్ మహారాజా, శ్రీలీల జోడీ ఎనర్జీ నెక్స్ట్ లెవల్ అనే చెప్పాలి.ఓవరాల్ గా సాంగ్ మంచి ఎనర్జిటిక్ అనే చెప్పాలి.
చూడాలి ఈ సినిమాతో ఎలాంటి హిట్ అందుకుంటాడో.