కాఫీ, టీ తాగే ముందు మంచినీళ్లు తాగితే మంచిదా..కాదా?

చాలామంది తరచూ టీ, కాఫీ ఇష్టంగా తాగుతుంటారు.కనీసం 5 నుంచి 8 వరకు టీ, కాఫీ తాగే వాళ్ళు ఉన్నారు.

 Drinking Water Before Tea Or Coffee Healthy Or Not,caffine,drinking Water, Acidi-TeluguStop.com

అలాగే టీ, కాఫీ తాగే ముందు కొందరు నీళ్లు తాగుతారు.అయితే ఈ అలవాటు మంచిదా? కాదా? అన్న విషయంపై ఇప్పుడు వివరాలు తెలుసుకుందాం.అయితే టీ, కాఫీ లో కెఫీన్ అధికంగా ఉంటుంది.ఇది మన ఆరోగ్యానికి నష్టం కలిగిస్తుంది.అందుకే టీ, కాఫీ తాగే ముందు నీళ్లు తాగడం ఆరోగ్యానికి ఎంతో మంచిది.

రోజు ఉదయం సాయంత్రం టీ,కాఫీ తాగే అలవాటు ఉంటే దానికంటే 15 నిమిషాల ముందు నీళ్లు తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిది.

ఈ అలవాటు మనల్ని వ్యాధులనుంచి సంరక్షణ ఇస్తుంది.అయితే చాలామందికి టీ లేదా కాఫీ తాగడం వల్ల పళ్ళు పాడైపోతాయి అన్న భయం ఉంటుంది.ఎందుకంటే ఇందులో ట్యానిన్ పేరు ఉన్న పోషక పదార్థాలు ఉంటాయి.ఇవి పళ్ళ రంగును దెబ్బతీస్తాయి.

అందుకే టీ లేదా కాఫీ తాగే ముందు మంచినీళ్లు తాగితే పళ్లకు ఎలాంటి హాని జరగదు.నీళ్లు పళ్లకు ఓ రక్షణ కవచంలా ఏర్పరుస్తాయి.

Telugu Acidity, Caffine, Coffee, De, Benefits, Tips-Telugu Health

అలాగే పరగడుపున కూడా టీ కాఫీ తాగడం వల్ల చాలా మందికి ఎసిడిటీ సమస్య ఏర్పడుతుంది.అందుకే ఇక ఈ సమస్య నుండి బయట పడేందుకు టీ, కాఫీ తాగే ముందు 15 నిమిషాల ముందు నీళ్లు తాగితే ఎసిడిటీ లాంటి కడుపు సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు.అలాగే అల్సర్ సమస్య ఉన్న వాళ్లు కూడా విముక్తి పొందవచ్చు.ఇక పరగడుపున టీ, కాఫీ తాగడం వల్ల డిహైడ్రేషన్ సమస్య ఏర్పడుతుంది.

అయితే ఈ డిహైడ్రేషన్ చాలా వ్యాధులకు కారణం అవుతుంది.అందుకే టీ, కాఫీ తాగే ముందు నీళ్లు తాగడం వల్ల డిహైడ్రేషన్ సమస్య తలెత్తదు.

అలాగే శరీరంలో కూడా న్యూట్రియంట్ల లోపం ఏర్పడదు.అంతేకాకుండా టీ లేదా కాఫీ పెడగొడుతున్న తాగడం వల్ల శరీరానికి వేడి చేస్తుంది.

అందుకే పరగడుపున నీళ్లు తాగితే శరీరానికి చలువ చేస్తుంది.దీంతో ఆ టీ మన శరీరానికి ఎలాంటి హాని కలగచేయదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube