Celebrities Marriages : ఈ ఏడాది పెళ్లి చేసుకున్న సెలబ్రిటీలు వీరే.. లిస్టులో ఎవరున్నారంటే..!

ఈ ఏడాది 2022లో చాలా మంది సెలబ్రిటీలు జంటలుగా మారారు.తమ పెళ్లిపై అనేక వార్తలు వచ్చినా స్పందించని సెలబ్రిటీలు కొందరు.

 Star Celebrities Who Married In 2022 Full Details Inside, Nayanatara, Alia Bhat,-TeluguStop.com

సడెన్‌గా పెళ్లి చేసుకొని ట్విస్టులు ఇచ్చచారు.కరోనా కారణంగా చాలా మంది పెళ్లి వాయిదా వేసుకున్నారు.

తర్వాత ఈ ఏడాది ముహూర్తాలు బాగా ఉండటంతో పలువురు సెలబ్రిటీలు ఇంటివారయ్యారు.ఈ లిస్టు ఈ ఏడాది ఎక్కువగానే ఉంది.

బాలీవుడ్‌ స్టార్‌ నటులు ఆలియా భట్‌, హీరో రణ్‌బీర్‌ కపూర్‌ జంట ఈ ఏడాది ఏప్రిల్‌ 14న వివాహం చేసుకున్నారు.బ్రహ్మాస్ర్త మూవీ సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించింది.

తర్వాత మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.వెంటనే ఈ ఏడాదే ఆడ బిడ్డకు జన్మనిచ్చింది ఆలియా భట్‌.

పాప పేరు కూడా రాహాగా పెట్టుకున్నారు ఈ జంట.మరో ప్రముఖ నటి మౌని రాయ్‌ కూడా దుబాయ్‌ వ్యాపారవేత్త సూరజ్‌ నంబియార్‌ను మనువాడింది.జనవరి 27న గోవాలో వీరిద్దరూ ఒక్కటయ్యారు.

హిందీ సీరియళ్లలో నటించిన మౌని రాయ్‌.

తర్వాత బాలీవుడ్‌లో సినిమా చాన్స్‌లు దక్కించుకుంది.సోషల్‌ మీడియాలో హాట్‌ పోజులతో ఈ ముద్దుగుమ్మ హల్‌ చల్‌ చేస్తూ ఉంటుంది.

దక్షిణాది సినీ తారల్లో ప్రముఖ హీరోయిన్‌గా పేరు గాంచిన నయనతార కూడా నటుడు విష్నేష్‌ను మనువాడింది.చాలా ఏళ్లపాటు వీరిద్దరి మధ్య ప్రేమాయణం సాగింది.

చివరకు ఈ ఏడాది జూన్‌ 10న వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు.అయితే సరోగసీ పద్ధతిలో నాలుగు నెలలకే కవల పిల్లలకు తల్లిదండ్రులుగా మారారు ఈ జంట.

Telugu Ala Fazal, Alia Bhat, Bollywood, Hansika, Mouni Roy, Nayanatara, Ranbeer

సింధీ సంప్రదాయంలో హన్సిక పెళ్లి.ఇక రిచా చద్దా, అలా ఫజల్‌ ఈ ఏడాది సెప్టెంబర్‌ 30న పెళ్లి చేసుకున్నారు.కరోనా కారణంగా వాయిదా పడిన వీరి పెళ్లి ఈ ఏడాది వైభవంగా జరుపుకున్నారు.మరోవైపు సీనియర్‌ హీరోయిన్‌ హన్సిక కూడా ఈ ఏడాదే పెళ్లిపీటలెక్కింది.రీసెంట్‌గా డిసెంబర్‌ 4న ముంబై వ్యాపారవేత్త సోహైల్‌ను హన్సిక పెళ్లి చేసుకుంది.సింధీ సంప్రదాయం ప్రకారం వీరి పెళ్లి అంగరంగ వైభవంగా సాగింది.

అలాగే నటి పూర్ణ కూడా అక్టోబర్‌ 25న ప్రియుడిని పెళ్లాడింది.ఇక అదితి ప్రభుదేవా యషాస్‌ని నవంబర్‌ 28న పెళ్లి చేసుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube