Megastar chiranjeevi Bholashankar : భోళాశంకర్‌ ఆపాలి.. రీమేక్‌లు వద్దే వద్దంటూ ఫ్యాన్స్‌ ఏం చేశారంటే..!

సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం రీమేక్‌ల ట్రెండ్‌ నడుస్తోంది.అగ్ర హీరోలంతా రిస్క్‌ చేయకుండా మరో భాషలో విడుదలై సంచలన విజయాలు పొందిన కథలను ఎత్తుకొచ్చి రీమేక్‌ చేయడం పరిపాటిగా మారుతోంది.

 Megastar Fans Want To Stop Bholashankar Movie Details Inside , Megastar Chiranje-TeluguStop.com

ఈ తరుణంలో చాలా వరకు చిత్రాలు బోల్తా కొడుతున్నాయి. బాలీవుడ్‌లో అయితే ఈ డిజాస్టర్ల సంఖ్య మరింత పెరిగిందని సినీ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.

ఇందుకు కారణాలు కూడా అనేకం ఉన్నాయని చెబుతున్నారు.ప్రస్తుతం థియేటర్ల కంటే ఓటీటీ వేదికలపైనే సినిమాలు చూసే వారి సంఖ్య రెట్టింపయింది.

ఏ కొత్త సినిమా, ఏ భాషలో రిలీజైనా నెలకో రెండు నెలలకో ఓటీటీ వేదికలపైకి వచ్చేస్తోంది.ఈ క్రమంలో ఇంట్లోనే హోం థియేటర్లో కూర్చొని హెచ్‌డీ క్వాలిటీతో సినిమాలు చూసేస్తున్నారు జనం.అయితే, ఇక చూసేసిన మూవీ మళ్లీ చూడాలంటే ఎవరికైనా బోరింగ్‌గానే ఉంటుంది.

అగ్ర హీరోలు ఆ కథలను ఎత్తుకొచ్చి మళ్లీ తెలుగులోకి డబ్‌ చేసి వదలడం వల్ల చాలా మంది అలాంటి మూవీలను ఆదరించడం లేదు.

థియేటర్లకు వెళ్లడమే తగ్గించేస్తున్నారు.ఈ నేపథ్యంలో ప్రస్తుతం టాలీవుడ్‌లో పవన్‌ కళ్యాణ్ హీరోగా చేయాలని చూస్తున్న తమిళ చిత్రం థెరి.ఈ చిత్రాన్ని రీమేక్‌ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.అయితే, తమకు రీమేకులు వద్దే వద్దంటున్నారు అభిమానులు.

వీయ్‌ డోంన్ట్ వాంట్‌ థెరి రీమేక్‌.అనే యాష్‌ ట్యాగ్ ని ట్రెండ్‌ చేస్తున్నారు.

Telugu Bholashankar, Chiranjeevi, Mehar Ramesh, Tollywood-Movie

రీమేకులు వద్దు బాబోయ్‌.అయితే, పవన్‌ చేస్తున్న ఈ పని ప్రస్తుతం చిరంజీవిపై కూడా పడింది.చిరంజీవి తాజాగా వాల్తేరు వీరయ్య మూవీలో నటిస్తున్నారు.సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది.మరోవైపు చిరంజీవి తదుపరి చిత్రం భోళాశంకర్‌ కూడా రీమేక్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది.అయితే, ఈ మూవీని కూడా ఆపేయాలనే డిమాండ్‌ ఊపందుకుంది.

ఇక రీమేకులు వద్దే వద్దంటూ ట్విట్టర్‌ వేదికగా అభిమానులు హోరెత్తిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube