భోళాశంకర్ ఆపాలి.. రీమేక్‌లు వద్దే వద్దంటూ ఫ్యాన్స్ ఏం చేశారంటే..!
TeluguStop.com
సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం రీమేక్‌ల ట్రెండ్ నడుస్తోంది.అగ్ర హీరోలంతా రిస్క్ చేయకుండా మరో భాషలో విడుదలై సంచలన విజయాలు పొందిన కథలను ఎత్తుకొచ్చి రీమేక్ చేయడం పరిపాటిగా మారుతోంది.
ఈ తరుణంలో చాలా వరకు చిత్రాలు బోల్తా కొడుతున్నాయి.బాలీవుడ్‌లో అయితే ఈ డిజాస్టర్ల సంఖ్య మరింత పెరిగిందని సినీ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.
ఇందుకు కారణాలు కూడా అనేకం ఉన్నాయని చెబుతున్నారు.ప్రస్తుతం థియేటర్ల కంటే ఓటీటీ వేదికలపైనే సినిమాలు చూసే వారి సంఖ్య రెట్టింపయింది.
ఏ కొత్త సినిమా, ఏ భాషలో రిలీజైనా నెలకో రెండు నెలలకో ఓటీటీ వేదికలపైకి వచ్చేస్తోంది.
ఈ క్రమంలో ఇంట్లోనే హోం థియేటర్లో కూర్చొని హెచ్‌డీ క్వాలిటీతో సినిమాలు చూసేస్తున్నారు జనం.
అయితే, ఇక చూసేసిన మూవీ మళ్లీ చూడాలంటే ఎవరికైనా బోరింగ్‌గానే ఉంటుంది.అగ్ర హీరోలు ఆ కథలను ఎత్తుకొచ్చి మళ్లీ తెలుగులోకి డబ్ చేసి వదలడం వల్ల చాలా మంది అలాంటి మూవీలను ఆదరించడం లేదు.
థియేటర్లకు వెళ్లడమే తగ్గించేస్తున్నారు.ఈ నేపథ్యంలో ప్రస్తుతం టాలీవుడ్‌లో పవన్ కళ్యాణ్ హీరోగా చేయాలని చూస్తున్న తమిళ చిత్రం థెరి.
ఈ చిత్రాన్ని రీమేక్ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.అయితే, తమకు రీమేకులు వద్దే వద్దంటున్నారు అభిమానులు.
వీయ్ డోంన్ట్ వాంట్ థెరి రీమేక్.అనే యాష్ ట్యాగ్ ని ట్రెండ్ చేస్తున్నారు.
"""/"/
రీమేకులు వద్దు బాబోయ్.అయితే, పవన్ చేస్తున్న ఈ పని ప్రస్తుతం చిరంజీవిపై కూడా పడింది.
చిరంజీవి తాజాగా వాల్తేరు వీరయ్య మూవీలో నటిస్తున్నారు.సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
మరోవైపు చిరంజీవి తదుపరి చిత్రం భోళాశంకర్ కూడా రీమేక్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది.
అయితే, ఈ మూవీని కూడా ఆపేయాలనే డిమాండ్ ఊపందుకుంది.ఇక రీమేకులు వద్దే వద్దంటూ ట్విట్టర్ వేదికగా అభిమానులు హోరెత్తిస్తున్నారు.
మెడ నలుపుతో వర్రీ వద్దు.. ఇవి ట్రై చేయండి..!