ది వారియర్ అంచనాలను అందుకోకపోవడంతో ఏమాత్రం లేట్ చేయకుండా తన నెక్స్ట్ సినిమా బోయపాటితో మొదలు పెట్టేశాడు ఎనర్జిటిక్ స్టార్ రామ్.ఈ మూవీని పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
బోయపాటి సినిమా అంటే మాస్ ఫ్యాన్స్ కి పండుగ అన్నట్టే.అసలే అఖండ హిట్ కొట్టిన జోష్ లో ఉన్న బోయపాటి శ్రీను రాం సినిమాను నెక్స్ట్ లెవల్ లో ఉండేలా ప్లాన్ చేస్తున్నాడట.
అయితే ఈ సినిమాలో రామ్ లుక్ ఎలా ఉంటుంది అన్నది తెలిసిపోయింది.రాం లేటెస్ట్ రగ్డ్ లుక్ ఫ్యాన్స్ కి బాగా నచ్చేసింది.
గడ్డంతో రామ్ న్యూ లుక్ సూపర్ అనేలా ఉంది.పాన్ ఇండియా సినిమాకు ఈ మాత్రం లుక్ ఉండాల్సినే అని ఉస్తాద్ రామ్ ఫ్యాన్స్ అంటున్నారు.ది వారియర్ తోనే తెలుగు, తమిళంలో ట్రై చేసిన రామ్ ఈసారి నేషనల్ లెవల్ లో సత్తా చాటాలని ఫిక్స్ అయ్యాడు.అందుకే ఈ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తుంది.
రామ్ తో బోయపాటి చేసే సినిమా ఎలా ఉండబోతుంది.పాన్ ఇండియా ఆడియన్స్ ని మెప్పించేందుకు వారు ఎలా రాబోతున్నారు లాంటి విషయాలు త్వరలో తెలుస్తాయి.