ప్రస్తుత వింటర్ సీజన్ లో ఆరోగ్యం విషయంలో ఏ మాత్రం అజాగ్రత్తగా వ్యవహరించిన ఎన్నో సమస్యలను ఫేస్ చేయాల్సి ఉంటుంది.ముఖ్యంగా ఈ సీజన్ లో రోగ నిరోధక వ్యవస్థ సహజంగానే బలహీనపడుతుంది.
ఫలితంగా జలుబు, దగ్గు, జ్వరం తదితర సీజనల్ సమస్యలు తీవ్రంగా సతమతం చేస్తుంటాయి.అలాగే ఈ సీజన్ లో శ్వాస సంబంధిత సమస్యలు సైతం మరింత ఎక్కువవుతుంటాయి.
అయితే వీటన్నిటికీ చెక్ పెట్టి ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడటంలో యాపిల్ అద్భుతంగా సాయపడుతుంది.ముఖ్యంగా యాపిల్ ను ఇప్పుడు చెప్పబోయే విధంగా తీసుకుంటే వింటర్ లో మీ ఆరోగ్యానికి ఎటువంటి ఢోకా ఉండదు.
మరి ఇంకెందుకు ఆలస్యం యాపిల్‌ను ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం పదండి.ముందుగా ఒక యాపిల్ పండును తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
అలాగే అర అంగుళం అల్లం ముక్కను తీసుకుని పొట్టు తొలగించి సన్నగా స్లైసెస్ మాదిరి కట్ చేసుకోవాలి.
ఇక చివరగా ఒక నిమ్మ పండును తీసుకుని తొక్క తొలగించి ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఇప్పుడు బ్లెండర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న యాపిల్ ముక్కలు, నిమ్మ పండు ముక్కలు, అల్లం స్లైసెస్, ఐదు నుంచి ఎనిమిది ఫ్రెష్ పుదీనా ఆకులు, ఒక గ్లాస్ వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న జ్యూస్ ను ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ కు గంట ముందు సేవించాలి.
ప్రస్తుత వింటర్ సీజన్ లో ప్రతిరోజు ఈ ఆపిల్ జ్యూస్ ను తీసుకుంటే రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుంది.దాంతో వివిధ రకాల సీజనల్ వ్యాధులు దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.
అంతేకాదు, ఈ యాపిల్ జ్యూస్ ను తీసుకోవడం వల్ల శ్వాస సంబంధిత సమస్యలు దూరం అవుతాయి.ఆస్తమా లక్షణాలు అదుపులో ఉంటాయి.నీరసం అలసట వంటివి దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.రోజంతా యాక్టివ్ గా ఉంటారు.వెయిట్ లాస్ అవుతారు.చలిని తట్టుకునే సామర్థ్యం సైతం లభిస్తుంది.