Jabardast Team Leaders Remuneration : జబర్దస్త్ లో వాళ్లకు మాత్రమే లక్షల్లో రెమ్యూనరేషన్.. కమెడియన్ షాకింగ్ కామెంట్స్?

బుల్లితెరపై ఎన్నో రియాలిటీ షోలు కామెడీ కార్యక్రమాలు ప్రసారం అవుతూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.ఈ క్రమంలోనే బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నటువంటి కార్యక్రమాలలో జబర్దస్త్ కార్యక్రమం ఒకటి.

 Remuneration In Lakhs Only For Them In Jabardast Comedian's Shocking Comments ,-TeluguStop.com

గత పది సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం ఎంతో మంచి రేటింగ్స్ సొంతం చేసుకొని బుల్లితెర ప్రేక్షకులను సందడి చేయడమే కాకుండా ఈ కార్యక్రమం ద్వారా కమెడియన్లుగా ప్రేక్షకులకు పరిచయమై ఇండస్ట్రీలో ఎంతో మంచి స్థానంలో ఉన్నటువంటి వారు కూడా ఉన్నారు.ఇకపోతే మరికొందరు కొన్ని కారణాల వల్ల ఈ కార్యక్రమం నుంచి దూరమై పూర్తిగా బుల్లితెర కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.

ఈ విధంగా జబర్దస్త్ కార్యక్రమం ద్వారా చమ్మక్ చంద్ర ఎంతో మంచి గుర్తింపు పొందారు.ఇక ఈయన టీంలో పని చేసిన కమెడియన్లు కూడా మంచి గుర్తింపు పొందారు.

ఇలా చమ్మక్ చంద్ర టీం లో సందడి చేసిన కమెడియన్ ఆనంద్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఈ కార్యక్రమం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కంటెస్టెంట్ ల గురించి వారి రెమ్యూనరేషన్ ల గురించి ఈయన మాట్లాడారు.

Telugu Chammak Chandra, Chandra, Anand, Jabardast-Movie

జబర్దస్త్ కార్యక్రమంలో కేవలం టీం లీడర్స్ కి మాత్రమే లక్షల్లో రెమ్యూనరేషన్లు ఉంటాయని మిగిలిన వారికి కేవలం వేళల్లో రెమ్యూనరేషన్ ఇస్తారని ఆనంద్ వెల్లడించారు.ఇక టీం లీడర్ గా కొనసాగుతూ వారి స్కిట్లకు మంచి రేటింగ్స్ వస్తేనే వారికి లక్షల్లో రెమ్యూనరేషన్ ఉంటుంది.చమ్మక్ చంద్ర స్కిట్లో చేసేటప్పుడు ఒక్కో స్కిట్ కి 15000 రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకొనేవాడిని అంటూ ఈ సందర్భంగా ఆనంద్ తెలియజేశారు.ఇక ఈ కార్యక్రమానికి వచ్చిన మొదట్లో టీమ్ లీడర్ కు 50,000 కంటెస్టెంట్ కు పదివేల అని మల్లెమాలవారే రెమ్యూనరేషన్ ఫిక్స్ చేస్తారని,మన పర్ఫామెన్స్ బట్టి పెంచుతూ వస్తారంటూ ఈ సందర్భంగా కమెడియన్ ఆనంద్ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube