Nagineedu : తెలుగోళ్లను వాళ్లు అలా వెక్కిరించారన్న నాగినీడు.. నేను అలా చేశానంటూ?

ప్రముఖ టాలీవుడ్ నటులలో ఒకరైన నాగినీడు తక్కువ సినిమాల్లోనే నటించినా విలక్షణమైన నటనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకోవడంతో పాటు తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు.చెన్నకేశవరెడ్డి సినిమాలో చిన్న పాత్రతో కెరీర్ ను మొదలుపెట్టిన నాగినీడు ఇప్పుడు టాలీవుడ్ బిజీ ఆర్టిస్ట్ లలో ఒకరిగా ఉన్నారు.

 Nagineedu Shocking Comments Goes Viral In Social Media Details, Nagineedu, Actor-TeluguStop.com

మేము ముగ్గురం అన్నాదమ్ములమని ముగ్గురు అక్కాచెల్లెళ్లు అని ఆయన పేర్కొన్నారు.

ఆరోజుల్లో సాయంకాలం స్నానం చేసేవాళ్లమని ఆయన చెప్పుకొచ్చారు.

ఆ సమయంలో రెండే జతల బట్టలు ఉన్నాయని ఆయన కామెంట్లు చేశారు.మా నాన్న రైతులకు ప్రయోజనం చేకూర్చడం కోసం కష్టపడేవారని ఆయన తెలిపారు.

మా నాన్నగారు సంస్కృతం చదవగలరని రాయగలరని కానీ నేను తెలుగులో ఫెయిల్ కావడంతో మాస్టర్ తిట్టారని నాగినీడు వెల్లడించడం గమనార్హం.

నాకు తెలుగు తప్ప మరే లాంగ్వేజ్ వచ్చేది కాదని ఆయన పేర్కొన్నారు.

తమిళనాడు వాళ్లు తెలుగు వాళ్లను అమాయకులు అని భావించే వాళ్లని అందుకే వాళ్లు తెలుగువాళ్లను గొల్టి అని అనేవాళ్లని అలా వెక్కిరించడంతో నేను ఎలక్షన్ లేకుండా కాలేజ్ స్టూడెంట్ ఛైర్మన్ అవుతానని ఛాలెంజ్ చేశానని ఆయన తెలిపారు.

Telugu Nagineedu, Chennakeshava, Jayam Ravi, Telugu, Tollywood-Movie

మోసం చేసి నేను కాలేజ్ స్టూడెంట్ ఛైర్మన్ అయ్యానని ఆయన పేర్కొన్నారు.

ఆ తర్వాత ప్రసాద్ ల్యాబ్ లో ఎంట్రీ ఇచ్చానని ఆయన కామెంట్లు చేశారు.తమిళంలో జయం రవి సినిమాకు నేను ఒప్పుకున్నానని డేట్స్ విషయంలో ఇబ్బందులు ఎదురు కావడంతో సినిమాను వదులుకోవాల్సి వచ్చిందని ఆయన చెప్పుకొచ్చారు.

ఈ సినిమాకు మాత్రమే తీసుకున్న అడ్వాన్స్ తిరిగి ఇవ్వడం జరిగిందని నాగినీడు అన్నారు.నాగినీడుకు మధ్యలో కొంతకాలం పాటు సినిమా ఆఫర్లు తగ్గినా ప్రస్తుతం ఆయనకు మళ్లీ సినిమా ఆఫర్లు పెరిగాయి.

నాగినీడు నచ్చిన పాత్రలకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇస్తుండటం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube