Journalist parrot : దొంగతనాలపై లైవ్ రిపోర్టింగ్ చేస్తున్న జర్నలిస్టుకు షాక్ ఇచ్చిన చిలుక..

జంతువులు, పక్షులు తరచూ విచిత్రమైన పనులు చేస్తాయి.కొన్నిసార్లు భయానకంగా, కొన్నిసార్లు ఫన్నీగా ఉంటాయి.

 The Parrot Shocked The Journalist Who Was Reporting Live On The Thefts Thieves,-TeluguStop.com

ఇంటర్నెట్ అటువంటి వీడియోలు ప్రస్తుతం మనకు చాలా కనిపిస్తున్నాయి.ఇదే తరుణంలో ఒక చిలుక లైవ్ స్ట్రీమింగ్ చేస్తుండగా ఓ చిలిపి పని చేసింది.

లైవ్ రిపోర్టింగ్ చేస్తున్నండగా జర్నలిస్టుకు షాకిచ్చింది.టీవీలో రిపోర్టర్ నుండి ఇయర్‌పీస్‌ని దొంగిలించింది.

ఆ వీడియో చూసి జనాలు నవ్వుకున్నారు.దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.

శాంటియాగో డి చిలీ నుండి రిపోర్టర్ ప్రసారం చేస్తున్న సమయంలో, ఒక చిలుక రిపోర్టర్ భుజంపై కూర్చుని అతని ఇయర్‌పీస్‌ని దొంగిలించి లైవ్ టీవీలో ఎగిరిపోయింది.ఈ వీడియో చూసిన వారంతా నవ్వుకుంటున్నారు.

చిలీవిజన్ ఛానెల్‌లో ఈ వీడియో ప్రసారం అయింది.జర్నలిస్ట్ నికోలస్ క్రమ్ ఆ ప్రాంతంలో దోపిడీలు, దొంగతనాలు పెరుగుతున్నాయని, వాటి గురించి ప్రత్యేక వీడియో చేస్తున్నాడు.

విషయం తీవ్రమైనది కావడంతో లైవ్ స్ట్రీమింగ్ పెట్టాడు.అక్కడ జరుగుతున్న దారుణాల గురించి, అదేపనిగా చెప్తున్నాడు.

ఆ సమయంలోనే చిలుక ఎక్కడి నుంచో వచ్చి రిపోర్టర్ భుజంపై వాలింది.క్షణాల్లోనే ఇయర్ పీస్ ఎత్తుకుని, ఎగురుకుంటూ పోయింది.

ఫుటేజ్ యొక్క చిన్న వీడియోను @Jaynes__World అనే యూజర్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు.దొంగతనం, భద్రత గురించి క్రైమ్ ప్రసారం చేస్తున్న సమయంలో చిలుక రిపోర్టర్ వద్దకు వెళ్లి అతని భుజంపై కూర్చున్న క్షణాన్ని వీడియోలో ఉంది.

కొద్దిసేపటి తర్వాత, ఇబ్బందికరమైన పక్షి రిపోర్టర్ చెవికి దగ్గరగా వచ్చి, ఇయర్‌పీస్‌ని మెల్లగా పట్టుకుని ఎగిరిపోతుంది.చిన్న అంతరాయం ఉన్నప్పటికీ ఆ రిపోర్టర్ తన పని కొనసాగించాడు.అతను తన ఎయిర్‌పాడ్‌ కోసం కెమెరామెన్‌కు సిగ్నల్ ఇవ్వడం కూడా వీడియోలో చూడవచ్చు.చిలుక చివరికి ఇయర్‌ఫోన్‌ను కొంచెం దూరంలో పడేసింది.ఈ వీడియో నెటిజన్లకు నవ్వులు పూయిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube