ధన్‌తేరాస్ రోజున కొన్న కొత్త పాత్రలతో కొత్త ఇంట్లోకి ప్రవేశించడం మంచిది కాదా..

దీపావళి పండుగను చెడుపై మంచి విజయం సాధించినందుకు ఎంతో సంతోషంగా జరుపుకుంటారు అన్న విషయం దాదాపు అందరికీ తెలిసిందే.సంప్రదాయం ప్రకారం దీపావళి పండుగకు ముందు వచ్చే ధన్‌తేరాస్ రోజును ఎంతో పవిత్రంగా భావిస్తారు.

 Isn't It Good To Enter A New House With New Utensils Bought On Dhanteras Day ,-TeluguStop.com

ఈ రోజున ధన్వంతరి పూజను భక్తిగా చేస్తే ఆ కుటుంబంలోని ప్రతీ ఒక్కరు అనారోగ్య సమస్యలకు దూరం అవుతారు.ముఖ్యంగా ఇలాంటి మంచి రోజు కొన్ని వస్తువులను కొనుగోలు చేయడం సాంప్రదాయంగా వస్తూ ఉంది.

ఇది అత్యంత శుభమని కూడా మన పూర్వీకులు నమ్ముతారు.చాలామంది ప్రజలు బంగారం, వెండి వస్తువులను కొంటూ ఉంటారు.

ఆ వస్తువులకు పసుపు, కుంకుమ పుసి అమ్మవారి పాదలో చెంత ఉంచుతారు.ఇలా చేయడం వల్ల ఇంటిలో అదృష్టం వస్తుందని ఆ ఇంటి వారికి శుభమే జరుగుతుందని భక్తులు నమ్ముతూ ఉంటారు.

అయితే ఈ పవిత్ర దినాన ఇంట్లోకి ఖాళీ చేతులతో రాకూడదు.

మీరు కూడా ధనత్రయోదశి రోజున కొత్త పాత్రలు బంగారు, వెండి నాణేలు కొనాలని ఆలోచిస్తున్నట్లయితే, వాటిని తీసుకుని ఇంట్లోకి ప్రవేశించే సమయంలో మూడు వస్తువులలో ఒకదాన్ని మీ వద్ద ఉంచుకోవడం మంచిది.

ఇలాంటి రోజుల్లో ఖాళీ పాత్రలను తీసుకుని ఇంట్లోకి ప్రవేశించడం అశుభంగా భావిస్తారు.కాబట్టి గృహప్రవేశం సమయంలో కచ్చితంగా ఉండవలసిన మూడు విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.

Telugu Dewali, Dewali Festival, Dhanteras, Diwali, Pooja-Latest News - Telugu

మీరు పాత్రలు కొంటున్నట్లయితే, ధనత్రయోదశి రోజున మీరు ఒకటి కాదు రెండు పాత్రలు కొనుగోలు చేసి రెండింటిలో నీరు,స్వీట్లతో నింపడం మంచిది.ఒక దానిని ధనత్రయోదశికి కోని, మరొకటి దీపావళి నాడు లక్ష్మీ-గణేశ పూజ కోసం కొనాలి.ధనత్రయోదశి రోజున బంగారం, వెండి కోని ఇంట్లోకి వచ్చేటపుడు మిఠాయిలు తప్పనిసరిగా ఉంటే మంచిది.ధనత్రయోదశి రోజున మీరు షాపింగ్ చేసి ఇంటికి రాగానే ఏడు రకాల ధాన్యాలు తెచ్చుకుంటే మీ ఇంటికి అన్నం, ఐశ్వర్యం, అదృష్టం లాంటి వన్నీ వస్తాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube