[11:34 AM, 10/16/2022] Bhargav: బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి నియోజకవర్గంలో ముఖం చూపెట్టే పరిస్థితి లేదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు.ఉపఎన్నికల ప్రచారం కోసం కోమటిరెడ్డి ఎక్కడికి వెళ్లినా ప్రజలు తరిమేస్తున్నారని చెప్పారు.
మునుగోడు ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా చండూరు మున్సిపాలిటీలో మంత్రి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ.
కాంట్రాక్టుల కోసం అమ్ముడుపోయిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పరిస్థితి అధ్వాన్నంగా తయారైందని చెప్పారు.గతంలో ఇచ్చిన హామీల గురించి ప్రజలు అడుగుతుంటే సిగ్గులేకుండా తన గూండాలతో దాడులు చేయిస్తున్నాడని విమర్శించారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అబద్ధాల మంత్రి అయ్యాడని ఎద్దేవాచేశారు.బీజేపీ నాయకులు ప్రతివిషయాన్ని అవహేళనగా మాట్లాడుతున్నారని చెప్పారు.
మంత్రి కేటీఆర్ మునుగోడును దత్తత తీసుకుంటానని చెప్పగానే నియోజకర్గ ప్రజలు సంతోషం వ్యక్తంచేస్తున్నారని చెప్పారు.