టీటీడీపీ బలోపేతమే బాబు లక్ష్యం ? చేరికలపై కీలక సూచన !

ఏపీ తెలంగాణ విబజన తర్వాత పూర్తిగా తెలంగాణ లో పార్టీ వ్యవహారాలను టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పక్కన పెట్టారు.పూర్తిగా ఏపీ రాజకీయాలపైనే దృష్టి సారించారు.

 Chandrababu Naidu Targets Telangana To Win In Elections,tdp, Chandrababu, Jagan,-TeluguStop.com

ఫలితంగా తెలంగాణలో టిడిపి ఉన్నా, లేనట్టుగానే ఉంది.ఆ పార్టీ నుంచి ఒక్కొక్క కీలక నేత ఇతర పార్టీలోకి చేరిపోతుండడం సర్వసాధారణంగా మారిపోయింది.

ప్రస్తుతం కొద్ది మంది నాయకులు మాత్రమే పార్టీని అడ్డుపెట్టుకుని ఉన్నారు.టిడిపికి బలమైన కార్యకర్తలు ఉన్నా.

వారిలో చాలామంది ఇతర పార్టీల వైపు ఆకర్షితులయ్యారు.అయితే గత కొద్ది రోజులుగా తెలంగాణలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసే విషయంపై టీడీపీ అధినేత చంద్రబాబు ప్రత్యేకంగా దృష్టి సారించారు.
దీనిలో భాగంగానే తెలంగాణ టిడిపి నాయకులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు .తాజాగా ఎన్టీఆర్ భవన్ లో నిన్న టిడిపి సభ్యత్వం నమోదుపై ఆ పార్టీ పార్లమెంట్ అధ్యక్షులు , నియోజకవర్గ ఇన్చార్జీలు, కోఆర్డినేటర్లతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా పార్టీ నాయకులకు అనేక సూచనలు చేశారు.రాబోయే తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో గెలవాలి అంటే పార్టీని మరింత బలోపేతం చేయాలని  , భవిష్యత్తు లో టిడిపికి తిరుగులేకుండా చేసేందుకు చేరికలపైనే ఎక్కువ దృష్టి సారించాలని చంద్రబాబు దిశ నిర్దేశం చేశారు.

ఈ మేరకు తెలంగాణ టిడిపి అధ్యక్షుడు బక్కని నరసింహులు, జాతీయ అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి, ప్రకటన విడుదల చేశారు.ఇక తెలంగాణ టిడిపి అధ్యక్షుడు బక్కని నరసింహులు మాట్లాడుతూ తెలంగాణలోని ప్రతి గ్రామంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వం పెంచే విధంగా పార్టీ నాయకులు అంతా కష్టపడి పనిచేయాలని,  సభ్యత్వ నమోదు సీరియస్ గా తీసుకుని ముందుకు వెళ్లాలని, అలాగే ఈ సభ్యత నమోదు ను మరింత విజయవంతం చేసేందుకు ఐ టీడీపీతో అనుసంధానం చేసుకోవాలని ఈ సందర్భంగా పార్టీ నాయకులకు దేశాన్ని నిర్దేశం చేశారు.

Telugu Chandrababu, Jagan, Nannarisimha, Ravulachandra, Telangana, Telangana Tdp

పోలీస్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి ఈ సమావేశంలో మాట్లాడారు.ప్రతి నియోజకవర్గంలో వీలైనంత ఎక్కువగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేసుకుందామని,  ఉదయం తూర్పున సూర్యుడు ఉదయించడం ఎంత నిజమో ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం అంతే నిజమని ఆయన పేర్కొన్నారు.తెలంగాణలో టిడిపిని బలోపేతం చేయాలని అందుకు అంత సమిష్టిగా పనిచేయాలని ఆయన సూచించారు.తెలంగాణలో టిఆర్ఎస్ కాంగ్రెస్ బిజెపిలకు గీటుగా టిడిపిని బయోపేతం చేయాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు.

దీని ద్వారా రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో చక్రం తిప్పేందుకు అవకాశం ఏర్పడుతుందనే లెక్కల్లో బాబు ఉన్నట్టుగా అర్థమవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube