మునుగోడు : కాళ్ల మొక్కుడు షురూ చేసిన కాంగ్రెస్ 

మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో గెలిచి తమ సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకుని తమ సత్తా చాటుకోవాలనే లక్ష్యంతో ఉంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. దీనికోసం అంది వచ్చిన ఏ చిన్న అవకాశాన్ని వదిలిపెట్టడం లేదు.

 Congress Party Balmuri Venkat Prajaswamya Parirakshanakai Padabhivandanam Campai-TeluguStop.com

ప్రధానంగా ఎన్నికల్లో గెలిచేందుకు టిఆర్ఎస్ ,బిజెపిలు గట్టి ప్రయత్నాలు చేస్తుండడం, ప్రధాన పోటీ అంతా తమ మధ్యనే అన్నట్లుగా ఆ రెండు పార్టీలు ప్రయత్నాలు చేస్తుండడంతో, కాంగ్రెస్ కూడా అప్రమత్తం అయింది.ఓటర్లు పూర్తిగా తమవైపు ఉండేలా చేసుకునేందుకు చిత్ర విచిత్రమైన వ్యూహాలకు శ్రీకరం చూడుతోంది.

దీనిలో భాగంగానే మునుగోడు నియోజకవర్గంలోని చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో ఎన్ ఎస్ యు ఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ ఆధ్వర్యంలో ప్రజాస్వామ్య పరిరక్షణకై పాదాభివందనం కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పాల్వాయి స్రవంతి ని గెలిపించుకునేందుకు నియోజకవర్గంలో ఎన్ఎస్ఈఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరు వెంకట్ ఆధ్వర్యంలో దాదాపు 1000 మందితో కూడిన తెలంగాణ ఎన్ఎస్ యుఐ బృందం ప్రజాస్వామ్య పరిరక్షణకు పాదాభివందనం కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా చౌటుప్పల్ లోని ఓటర్ల కాళ్లకు మొక్కుతూ కాంగ్రెస్ సభ్యుడిని గెలిపించాల్సిందిగా కోరారు.

అలాగే ఎన్నికల్లో అనేక అక్రమాలకు పాల్పడుతున్న కేంద్ర,

Telugu Balmuri Venkat, Central, Congress, Revanth Reddy-Political

  రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ కు ఓటు వేయాలని, ప్రజా వ్యతిరేక పాలనకు చరమ గీతం పాడాలని కేంద్రంలోనూ, రాష్ట్రంలోని అధికార పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలని ఓటర్లకు పిలుపునిచ్చారు.ఇక ఎన్నికల ప్రచారం ముగిసే వరకు నిత్యం ఓటర్ల ను ఇదే తరహాలో కలుస్తూ ఓట్లను అభ్యర్థించాలని కాంగ్రెస్ నిర్ణయించింది.  విభేదాలను పక్కనపెట్టి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించే ప్రయత్నంలో ఉండగా… భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం ఇంకా అసంతృప్తితోనే ఉన్నారు.

ఆయనను బుజ్జగించి ఎన్నికల ప్రచారంలో యాక్టివ్ చేయాలని ప్రయత్నాలు చేస్తున్న,  వెంకటరెడ్డి మాత్రం సైలెంట్ గానే ఉంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube