కర్ణాటక పీసీసీ చీఫ్ డికే శివకుమార్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎదుట హాజరయ్యారు.మనీ ల్యాండరింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో ఈడీ అధికారులు ఆయనపై గతంలోనే కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
దీనిలో భాగంగా విచారణకు హాజరుకావాలని శివకుమార్ కు ఈడీ అధికారులు గత వారం నోటీసులు జారీ చేశారు.ఈ క్రమంలో నోటీసుల ప్రకారం ఆయన అధికారుల ముందు హాజరయ్యారు.