ఇది నా బ్లడ్.. నా బేబీ.. నాలో ఒక ప్రాణం.. గీతూను టార్గెట్ చేసిన సుదీప!

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షో సీజన్6 లో రెండో వారం ఏకంగా ఇద్దరు కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు.బిగ్ బాస్ షో ద్వారా పెద్దగా వార్తల్లో నిలవని షాని, అభినయశ్రీ బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ కావడం గమనార్హం.

 Bigg Boss Sudeepa Emotional In Show Details Here Goes Viral , Sudeepa, Galata G-TeluguStop.com

మూడో వారం ఎలిమినేషన్ కు నామినేషన్ ప్రక్రియ మొదలు కాగా ఈ వారం ఎలిమినేషన్ కు ఏకంగా 9 మంది నామినేట్ అయ్యారని సమాచారం అందుతోంది.వాసంతి కృష్ణన్, ఇనయా సుల్తానా, చలాకీ చంటి, శ్రీహాన్, నేహా చౌదరి, ఆరోహి రావు, గీతూ రాయల్, సింగర్ రేవంత్, బాలాదిత్య ఈ వారం ఎలిమినేషన్ కు నామినేట్ అయ్యారని బోగట్టా.

అయితే తాజాగా రిలీజైన ప్రోమోలో నువ్వు నాకు నచ్చావ్ ఫేమ్ సుదీప ఎమోషనల్ అయ్యారు.శ్రీసత్య ఇనయా సుల్తానాను నామినేట్ చేయగా ఆమె శ్రీసత్యపై ఫైర్ అయ్యారు.

మొదట నీకు గేమ్ ఆడాలని లేదని మాట్లాడాలి కూర్చొని ముచ్చట్లు చెప్పాలి కబుర్లు చెప్పాలి ఇదొక్కటే నీకు తెలుసు అని ఇనయా సుల్తానా కామెంట్ చేయగా కెన్ ఐ టాక్ అంటూ శ్రీ సత్య కామెంట్ చేశారు.సిల్లీ నామినేషన్ అని ఇనయా కామెంట్ చేయగా కొత్తగా చెప్పేదేముంది సిల్లీ నామినేషన్స్ అని శ్రీసత్య చెప్పుకొచ్చారు.

ఆ తర్వాత గలాటా గీతూ సుదీపను నామినేట్ చేసింది. సుదీప గీతూతో మాట్లాడుతూ అంత సిల్లీ రీజన్ కు నామినేట్ చేశావంటే నీ బుద్ధి ఎక్కడుందో అర్థమవుతుందని అన్నారు.

ఆ తర్వాత ఆదిరెడ్డి బిగ్ బాస్ అనేది ఓపెన్ బుక్ అని చెబుతూ ఇనయాను నామినేట్ చేశారు.ఆ తర్వాత సుదీప గలాటా గీతూను నామినేట్ చేయడంతో పాటు ఎమోషనల్ అయ్యారు.

నా బిడ్డ గురించి ఆరోజు మనసులో ఉన్న బాధతో చెప్పానని ఆమె అన్నారు.

Telugu Aadi, Bigboss, Galata Geethu-Movie

ఇది నా బ్లడ్.నా బేబీ.నాలో ఒక ప్రాణం అది పోయినప్పుడు ఆ బాధ నాకు తెలుసని సుదీప కామెంట్లు చేశారు.

నీకింకా ఆ ఎమోషన్ తెలియదని అనుకుంటున్నానని సుదీప చెప్పుకొచ్చారు.సుదీప చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరోవైపు ఈ వారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఎవరంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube