తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - సెప్టెంబర్ 17, శని వారం, 2022

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.07

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

15

రాహుకాలం:ఉ.9.00 ల10.30 వరకు

అమృత ఘడియలు: ఉ.10.30 మ12.00 సా అష్టమి వరకు

Advertisement

దుర్ముహూర్తం: ఉ.7:41 ల8.32 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Todays Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీరు చేసే ఉద్యోగంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.ప్రారంభించిన పనుల్లో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.అనవసరంగా ఇతరులు చెప్పిన మాటలకు మోసపోకండి.

తోటి వారి సహాయం మీకెప్పుడూ ఉంటుంది.చాలా సంతోషంగా ఉంటారు.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

వృషభం:

Advertisement

ఈరోజు మీరు అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.కానీ తిరిగి సంపాదించి స్తోమత మీలో ఉంటుంది.మీ తండ్రి యొక్క ఆరోగ్యం ఈరోజు కుదుట పడుతుంది.

కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.

మిథునం:

ఈరోజు మీరు ప్రారంభించిన పనుల్లో అంత శుభమే జరుగుతుంది.గతంలో పెట్టుబడుల నుండి మంచి లాభాలను పొందుతారు.స్థలం కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉంటారు.

కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాలు గురించి చర్చలు చేస్తారు.

కర్కాటకం:

ఈరోజు మీరు తోబుట్టులతో కలిసి చాలా సంతోషంగా ఉంటారు.కొన్ని ప్రారంభించిన పనులు వాయిదా వేసుకోవడమే మంచిది.మీ చిన్ననాటి స్నేహితులు ఈరోజు మిమ్మల్ని కలుస్తారు.

అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచనలు చేస్తారు.

సింహం:

ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో కలిసి బయట సమయాన్ని ఎక్కువగా కాలక్షేపం చేస్తారు.అనవసరంగా డబ్బులు ఎక్కువ ఖర్చు చేస్తారు.కానీ తిరిగి సంపాదించే స్తోమత మీలో ఉంటుంది.

కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేసే ముందు ఆలోచనల అవసరం.

కన్య:

ఈరోజు మీరు మీపై ఉన్న బాధ్యతలపై నిర్లక్ష్యం ఎక్కువగా చేస్తారు.అనవసరమైన విషయాలలో తలదూర్చకుండా ఉండడమే మంచిది.కొన్ని వర్గ సంబంధిత విభేదాలు జరిగే అవకాశం ఉంది.

తరచూ మారే మీ నిర్ణయాల వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

తులా:

ఈరోజు మీరు చేపట్టే పనుల్లో అలసట పెరగకుండా చూసుకోవాలి.ఇంటి నిర్మూలన గురించి కుటుంబ సభ్యులతో చర్చలు చేస్తారు.సమయానికి బయట అప్పుగా ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా తిరిగి మీ చేతికి అందుతుంది.

ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచి జరుగుతుంది.

వృశ్చికం:

ఈరోజు మీరు పిల్లల భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచనలు చేస్తారు.మీరు చేసే ఉద్యోగంలో కొన్ని మార్పుల వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు.గత కొంతకాలం నుండి తీరికలేని సమయంతో గడుపుతారు.

పై అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు.

ధనస్సు: 

ఈరోజు మీరు మనోధైర్యంతో చేసే పనులు కలిసి వస్తాయి.మీరు ప్రారంభించిన వ్యాపారంలో అధిక లాభాలు అందుకుంటారు.ఇతరుల సహాయంతో అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.

చాలా ఉత్సాహంగా ఉంటారు.

మకరం:

ఈరోజు మీరు ఇరుగు పొరుగు వారితో వాదనలకు దిగే అవకాశం ఉంది.మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండడమే మంచిది.ఈరోజు మానసిక బలహీనతను కోల్పోతారు.

ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళితే అంతా మంచి జరుగుతుంది.

కుంభం:

ఈరోజు మీరు తలపెట్టిన కార్యక్రమాల్లో ఆటంకాలు ఎదుర్కొంటారు.కొందరు ప్రవర్తన మీలో బాధను కలిగిస్తుంది.ఇతరులు చెప్పిన మాటలకు అనవసరంగా మోసపోకండి.

మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి అవకాశం ఉంది.

మీనం:

ఈరోజు మీ కుటుంబంలో కొన్ని చిన్నపాటి సమస్యలు ఎదురవుతాయి.కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.అక్కడ మీకు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

ఇతరులతో మీ వ్యక్తిగత విషయాలను పంచుకోవడం వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.

తాజా వార్తలు