దేశంలో రోడ్డు ప్రమాదాలు రోజురోజుకి పెరుగుతున్న నేపథ్యంలో.కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
రోడ్డు ప్రమాదాలకు జరగడానికి ఆయా సంస్థలు రూపొందించే తప్పుడు ప్రాజెక్ట్ నివేదికలే కారణమని విమర్శించారు.రోడ్ల నిర్మాణాలకు సంబంధించి సవివరమైన నివేదికలు తయారు చేసేందుకు వీలుగా కంపెనీలకు సరైన శిక్షణ అవసరమని వ్యాఖ్యనించారు.
సరికొత్త టెక్నాలజీని ఉపయోగించుకోవడాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు.ఇకనైనా డీపీఆర్ ల నుంచే ప్రారంభం కావాలని.
వాటిని రెడీ చేసే కంపెనీలు మెరుగుపడకపోతే సమస్య పునరావృతం అవుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.