టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన సందర్భంగా జరిగిన కుప్పం ఘటనపై ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి స్పందించారు.ఈ ఘటన శాంతి భద్రతలను ఇబ్బంది పెట్టేంత పెద్దది కాదని పేర్కొన్నారు.
కుప్పం ఘటనలో పాల్గొన్న వారు స్థానికులేనని స్పష్టం చేశారు.చంద్రబాబుకు ఎన్ఎస్జీ సెక్యూరిటీ పెంచడం, తగ్గించడం అనేది వచ్చే ఇన్ పుట్స్ పై ఆధారపడి ఉంటుందని తెలిపారు.
అదేవిధంగా ఎంపీ గోరంట్లపై సీఐడీ విచారణ జరుగుతోందని వెల్లడించారు.కుప్పంలో టీడీపీ నేతలు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని చిత్తూరు ఎస్పీ తెలపారని స్పష్టం చేశారు.
రెవెన్యూ అధికారుల ఫిర్యాదుతో కేసులు నమోదు చేసినట్లు డీఐజీ తెలిపారు.