రానున్న ఎన్నికల నేపథ్యంలో ఏపీలో బీజేపీ ఇప్పటి నుంచే తీవ్ర కసరత్తు మొదలుపెట్టింది.ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపోరు సభలు నిర్వహించాలని భావిస్తోంది.
దీనిలో భాగంగానే ఐదు చోట్ల ఈ సభలను నిర్వహించాలని పార్టీ భావిస్తోందని తెలుస్తోంది.ఈ క్రమంలో సభల నిర్వహణ, ఏర్పాట్లపై ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు.
అదేవిధంగా ఈ పోరు సభలకు కేంద్రమంత్రులు, ఎంపీలతో పాటు జాతీయ నేతలను కూడా ఆహ్వనిస్తున్నట్లు వెల్లడించారు.