ఆన్‌లైన్ లోన్ యాప్స్‌ భారీ షాక్ ఇచ్చిన గూగుల్..

భారత దేశాన్ని డిజిటల్ వైపు మళ్లించడానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోంది.అయితే ప్రభుత్వానికి ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయి.

 Google India Removed 2000 Loan Apps From Play Store Details, Online, Loan, Appli-TeluguStop.com

ముఖ్యంగా సైబర్ నేరగాళ్లు సామాన్యులను వేధింపులకు గురి చేస్తున్నారు.ఆన్‌లైన్ లోన్ యాప్స్ పేరిట కొంత మొత్తం అప్పు ఇచ్చి, ఎక్కువ మొత్తంలో బాధితుల నుంచి లాగేస్తున్నాయి.

కొందరు వీటి వల్ల ఆత్మహత్య చేసుకుంటున్నారు.ఈ తరుణంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు వినియోగదారుల ఫీడ్‌బ్యాక్‌పై తన ప్లే స్టోర్ విధానాలను సమీక్షించారు.

అప్పు ఇవ్వడంలో నిబంధనలను ఉల్లంఘించినందుకు జనవరి-జూన్ మధ్య కాలంలో గూగుల్ ఇండియా 2,000 లోన్ యాప్స్‌ను తొలగించింది.దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ ప్లే స్టోర్‌లో లోన్ ఆఫర్ యాప్‌లను లిస్టింగ్ చేయడానికి కఠినమైన విధానాలను ప్రవేశపెట్టే ప్రక్రియలో ఆర్‌బీఐ, గూగుల్ ఉన్నాయి.ఈ విషయాన్ని ఆసియా పసిఫిక్‌లోని గూగుల్ సీనియర్ డైరెక్టర్, ట్రస్ట్ అండ్ సేఫ్టీ హెడ్ సైకత్ మిత్రా తెలిపారు.

ఈ మార్పులు అటువంటి లోన్ యాప్‌లపై పరిశీలనను మరింత పెంచుతాయని, సేఫర్ విత్ గూగుల్ ఈవెంట్ రెండవ ఎడిషన్ సందర్భంగా ఆయన తెలిపారు.తాము విధాన మార్పుపై పని చేస్తున్నామని, లోప్ యాప్‌-బ్యాంకింగ్ భాగస్వామి మధ్య సంబంధాన్ని మరింత స్పష్టంగా చేస్తుందని వివరించారు.

కొత్త అప్‌డేట్ ఆవశ్యకతను, రెండింటిని ఎలా కనెక్ట్ చేశారనే దాని మధ్య సంబంధాన్ని స్పష్టంగా తెలియజేస్తుందని ఆయన పేర్కొన్నాడు.

Telugu India, Google, Google India, Loan, Loans, Store, Safer Google, Saikath Mi

గూగుల్ ఇండియా మే నెలలో కొత్త ప్లే స్టోర్ పాలసీని ప్రవేశపెట్టింది.ఏ రూపంలోనైనా రుణాలను అందించే యాప్‌లు వినియోగదారుల కోసం ఈ రుణాలను అండర్‌రైట్ చేసే బ్యాంకు, వినియోగదారుకు అందించే వడ్డీ రేటు, ఇతర వివరాలను ముందుగా ప్రదర్శించాలి.లోన్ యాప్‌ల ముప్పు ఉన్నప్పటికీ, గూగుల్ ఇండియా అటువంటి యాప్‌లను ప్లే స్టోర్‌లో రాకుండా నిషేధాన్ని అమలు చేయలేదు.

భారతదేశం నిజంగా డిజిటల్ ఎనేబుల్డ్ ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెందుతున్నందున, ఆన్‌లైన్ భద్రత బాగుండాలని ఆయన అభిప్రాయపడ్డారు.దేశవ్యాప్తంగా లక్ష మంది డెవలపర్లు, స్టార్టప్‌లు, ఇతర నిపుణుల కోసం సైబర్‌ సెక్యూరిటీ అప్‌స్కిల్లింగ్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించనున్నట్లు కంపెనీ తెలిపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube